దీయా తన అంకుల్ అశోక్ వాళ్ల ఊరికి వచ్చింది. ఆమెకు అడవిని చూడాలని ఉంది. నగరంలో నివసిస్తోంది కనుక అడవిని ఎప్పుడూ చూడలేదు. చాలాకాలం తర్వాత దీయా కలవడంతో అశోక్ కూతురు రైనాకి థ్రిల్‌గా ఉంది. దీయా ఊరికి చేరుకోగానే “రైనా, నాకు అడవిని చూడాలని ఉంది" అని చెప్పింది.
“అవును, మీరిద్దరూ వెళ్లవచ్చు” అన్నాడు అశోక్ అంకుల్.
“అద్భుతం!” రైనా అరిచింది.
“ఈ రోజు వెళదాం” అంది. వెంటనే వాళ్లు అడవి వైపు బయలుదేరారు.
“అక్కడిదాకా మనం నడుస్తామా?" దీయా అడిగింది.
“మనం సైకిల్‌పై రోడ్డుపై వెళితే 15 కిలోమీటర్లు వెళ్లాలి. నడచి వెళితే మూడు కిలోమీటర్లు వెళ్లాలి. మనం అడవిని చూడాలనుకుంటే నడవాలి”.
“సరే, మనం నడుద్దాం”.
వాళ్లు బయలుదేరారు. ఊరవతల పచ్చని పొలాలు, పూల మొక్కలతో నిండిన తోటలు కనిపించాయి.
పొలాలు ముగిసిన చోట అడవి మొదలైంది.
“మనం ఇక్కడ ఉన్నాం" రైనా చెప్పింది.
దీయా తలాడించింది.
"ఏమిటా హక్ హక్ శబ్దం?”.
“కోతులు చెట్టు కొమ్మలపై కూర్చున శబ్దం అది" చెప్పింది రైనా.
“శబ్దాలు చాలా భయానకంగా ఉన్నాయి” అంది దీయా.
“మేము వాటికి అలవాటు పడ్డాం. కాబట్టి అవి మమ్మల్ని భయపెట్టవు" రైనా నడక కొనసాగిస్తూనే చెప్పింది. అడవి రకరకాల చెట్లు, పొదలతో నిండి ఉంది. నేలపై కింద పడినప్పుడు శబ్దం చేసే ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. అకస్మాత్తుగా రైనా దీయాను ఒకవైపు లాగింది “ఆగు. ఇది రెండు తలల పాము" అంది.
దీయా ఎగిరి గంతేసి “ఏమిటిది?” అడిగింది.
“కిందికి చూడు”.
కిందికి చూసి వణికిపోయింది. ఆమె ఒక పాము పై అడుగు వేయబోయింది. అది గోధమరంగులో ఉంది. రైనా దానిని తీయడానికి వంగినప్పుడు దీయా “ఏం చేస్తున్నావ్? అది కాటు వేస్తుంది” అని అరిచింది.
"ఇది దోమూహీ. ఇది రెండు తలల పాము.దీన్ని పట్టుకుంటే మంచిది అంటారు".
ఆమె దాన్ని పట్టుకుని మరొక ప్రదేశంలో విడిచిపెట్టింది.
هذه القصة مأخوذة من طبعة May 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.