నందనవనంలో ప్రవహిస్తున్న ఒక నది పక్కన ఎలుకలు నివసించే ఒక చిన్న పట్టణం 'టైనీ' ఉంది. ర్యాటీ తన కుటుంబంతో అక్కడ నివసిస్తున్నాడు. మనుషులు నివసించే నగరానికి దగ్గరగా టైనీ ఉంది. మున్సిపాలిటీ వాళ్లు నగరంలోని చెత్తను సేకరించి ప్రతి రోజు అడవిలో పడేస్తూ ఉంటారు. ఆ చెత్త కుప్పలో మిగిలిపోయిన ఆహారం కూడా ఉండేది.
అడవికి అవతలి వైపున కూరగాయలు బాగా పెరిగాయి. వాటికి అవి ఆహారంగా మారాయి. అందుకే ఎలుకలు ఆరోగ్యంగా తయారయ్యాయి. ర్యాటీ కొడుకు రిజో తన స్నేహితులతో కలిసి అడవంతా తిరుగుతూ ఆడుకునేవాడు. నగరానికి వెళ్లే రోడ్డుపైన కూడా ఆడుకునేవాడు.
నందనవనంలోని జంతువులన్నీ సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాయి. ఎవరూ ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని చిన్న ఏనుగులు నదిలో స్నానం చేయడానికి, ఎండలో ఆరబెట్టుకోవడానికి అక్కడికి వచ్చేవి. వాటి నాయకుడు ఇగ్గీ తరచుగా 'టైనీ'కి వచ్చేవాడు.
ఇగ్గీ కొంటెవాడు. కానీ తెలివైన ఏనుగు.అతడు నది వెంట నడవడం ఇష్టపడేవాడు. కానీ తాను వేసే ప్రతి అడుగు ఎలుకలు తయారుచేసుకున్న ఇళ్లను నాశనం చేస్తుందని అతడు గ్రహించలేకపోయేవాడు ఒక రోజు ఎలుకలు గుంపుగా ర్యాటీ దగ్గరికి వెళ్లి తమకు సహాయం చేయమని అడిగాయి. అప్పుడు ర్యాటీ “మరోసారి ఏనుగు వచ్చినప్పుడు నాకు చెప్పండి.నేను వారితో మాట్లాడుతాను" అని చెప్పాడు.
ఆ రోజు స్కూలు మూసివేసి ఉంది. బయట చలిగా ఉంది. మంచు బిందువులు పచ్చగడ్డిని మెరిపిస్తున్నాయి. అప్పుడు సమయం 8 గంటలు.యువ ఏనుగుల గుంపు నదిలో స్నానం చేసిన తర్వాత టైనీ వైపు నడవడం మొదలు పెట్టింది.
రిజో అక్కడ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. అకస్మాత్తుగా క్రికెట్ మైదానం వణకసాగింది. అది ఒక భూకంపంలాగా ఉంది. ఏనుగుల గుంపు సమీపించడం రిజో చూసాడు.వెంటనే ఇంటికి పరుగెత్తి తన తండ్రికి చెప్పాడు.
“రండి త్వరగా నాన్నగారూ, వాళ్లు టైనీకి చేరుకోబోతున్నారు".
هذه القصة مأخوذة من طبعة May 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా