డమరూ గాడిద ఒక పురుషుల బట్టల దుకాణంలో సేల్స్ మెన్ చేరిన మొదటి రోజు అది. బట్టలను పరిశీలిస్తూ దుకాణం చుట్టూ తిరుగు తున్నప్పుడు డమరూ కొంచెం అయోమయంలో పడ్డాడు.
ఎంక్వైరీ చేయడానికి క్యాషియర్ డెస్క్ వద్ద కూర్చున్న దుకాణం యజమాని రాకీ ఖడ్గమృగం దగ్గరికి వెళ్లాడు.
“సార్, మనం సెకండ్ హ్యాండ్ బట్టలను అమ్ముతున్నామా? బట్టలన్నీ పాతబడి, చిరిగి, మాసినట్లు కనిపిస్తున్నాయి. పైగా షర్టులలో కొన్నింటికి ఒక స్లీవ్ మాత్రమే ఉంది" అని చెప్పాడు.
రాకీ సరదాగా చూసాడు.
“లేదు, ఇప్పుడు ఈ బట్టలు వాడుకలో ఉన్నాయి.ప్రజలు అలాంటి బట్టలు ధరించడానికి ఇష్టపడతారు” అని చెప్పాడు.
ముఖం చిట్లిస్తూ డమరూ “విచిత్రంగా ఉందే. ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు?” అని అడిగాడు.
"దాన్ని వదిలెయ్ డమరూ, ఇది నా కోసమో, నీ కోసమో కాదు! నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి బట్టలు ఒక పూల్ మాత్రమే వేసుకుంటాడు!”
అప్పుడే దుకాణంలోకి చినో చిరుత పులి అడుగు పెట్టాడు. వెంటనే డమరూ అతని దగ్గరికి వెళ్లాడు. తాను చూసిన వాటితో ఎంతో సంతోషించాడు.చినో చిరుత పులి.
కొన్ని షర్టులు ఎంపిక చేసాడు. వాటిని డమరూకు ఇస్తే డమరూ వాటిని క్యాషియర్ డెస్క్ దగ్గరికి తీసుకు వెళ్లి ఇచ్చాడు.
చినో రాకీ దగ్గరికి వెళ్లి సంతోషంగా “నేను ఈ షర్టులు తీసుకుంటాను. మీ కలెక్షన్స్ ఎంతో ఇష్టపడుతున్నాను. వాటిలో నేను 100కి ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను” అని చెప్పాడు.
సంతోషించిన రాకీ ఈ ఆర్డర్తో తనకు వచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు.
వాటికి డబ్బులు చినో ఇవ్వబోతుంటే డమరూ నవ్వి అమాయకంగా “సార్, మీరు ఈ షర్టులు కొంటున్నందుకు, తప్పకుండా పూల్ అయి ఉండాలి” అన్నాడు.
ఒక్క క్షణం చినో, రాకీలు మౌనం వహించారు. తర్వాత చినో కోపంగా “ఏమిటి? నన్ను ఫూల్ అనడానికి నీకెంత ధైర్యం?” అని అరిచాడు.
కలవరపడుతూ డమరూ వెంటనే రాకీని చూపిస్తూ “నేను కాదు సార్, దుకాణంలోకి మీరు అడుగు పెట్టక ముందు, ఈయనే నాకు చెప్పారు" అని వివరించాడు.
భయపడిన రాకీ ఆలోచనలో పడ్డాడు.
"పిచ్చివాడా ఎందుకు అలా అన్నావు? ఒరేయ్ డమరూ నిన్ను... ఓహ్ నో... ఆర్డర్!” అని అడిగాడు.
هذه القصة مأخوذة من طبعة November 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.