రామన్ చదువులో ముందుండేవాడు. చాలా సున్నితమైన, తెలివైన అబ్బాయి. ఎప్పుడూ విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాడు. వాళ్ల ఇంటికి కొద్ది దూరంలో ఒక పేద కూలీ కుటుంబం నివసించే గుడిసె ఉంది. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్లేటప్పుడు
రామన్ వారిని గమనిస్తూ ఉండేవాడు. ఆ గుడిసె బయట దాదాపు ఐదారేళ్ల ఒక చిన్న అమ్మాయి కూర్చునేది. చాలా బలహీనంగా కనిపించేది.
"అమ్మా, ఈ అమ్మాయి ఎందుకింత బలహీనంగా ఉంది? ఆమె స్కూల్‌కు వెళ్లలేదా? ఎప్పుడూ ఆమె ఇంటి బయటే కూర్చోవడం నేను చూసాను" అని రామన్ ఒక రోజు ఉదయం తన తల్లిని అడిగాడు.
రామన్ తల్లి “బాబూ, ఆమె ఒక కూలీ బిడ్డ.
ఆమెకు పోషకాహారం లోపం ఉన్నట్లుంది.
సరైన ఆహారం తీసుకోలేదేమో. అందుకే ఆమె బలహీనంగా ఉంది. బహుశా స్కూల్‌కి వెళ్లనట్లుంది. అందుకే ఆమె ఎప్పుడూ గుడిసె బయట కూర్చుని ఉంటుంది" అని బదులిచ్చింది.
“స్కూల్‌కి వెళ్లడం మంచి విషయం. ఆమె స్కూల్‌కి వెళ్లాలి. అవును కదా?" అడిగాడు రామన్.
“నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కి పంపరు.
పంపడం వారి బాధ్యత” తల్లి చెప్పింది.
“మనం ఏమైనా ఆమెకు సహాయం చేయగలమా?” “మనకిప్పుడు స్కూల్‌కు
వెళ్లడం ఆలస్యమవుతుంది. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.” రామన్, అతని తల్లి స్కూల్వైపు వెళ్లారు. ఆమె అతన్ని స్కూల్ గేటు లోపల వదిలిపెట్టింది. అక్కడ రామన్ స్నేహితుడు అమన్ కలిసాడు. ఇద్దరూ కలిసి తమ తరగతి గదివైపు వెళ్లారు.
స్కూల్లో ఏదో జరుగుతోంది.
అంతా శుభ్రం చేస్తున్నారు.
هذه القصة مأخوذة من طبعة January 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
న్యూటన్ డిస్క్
ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!
మధురమైన స్నేహం
చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు.
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
బీచ్ స్నేహితులు
బీచ్ ఉన్న క్రస్టేసియన్స్, మొలస్క్‌ల సంఖ్య లెక్కించడంలో రిడాకు సహాయం చేయండి.
-వారాంతపు సెలవులు
ఇసుకలో ఇల్లు బిల్డింగ్ సెట్‌ను ఇతర బ్యాగ్‌ల \"మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు\" అని నిషా అనడంతో \"నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను.
ష్... నవ్వొద్దు...
హాహాహాహా
మంచి వర్షపు రోజు
మంచి వర్షపు రోజు
సరికానిది గుర్తించండి
ఈ చిత్రంలో కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. వాటిని కనిపెట్టండి.
డమరూ - కాఫీ
డమరూ - కాఫీ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి