సరిస్కా మహారాజు బగ్గా పులి “అదృశ్యమైన పులులను కనుగొనడంలో సహాయం చేసిన వారికి గొప్ప బహుమతులు ఇస్తాం" అని ప్రకటించాడు.
మకర సంక్రాంతి రోజున పిల్లలందరూ గాలిపటాలు ఎగుర వేయడానికి సరిస్కా సరస్సు ఒడ్డున గుమిగూడారు. ఆ సమయంలో అక్కడికి టోటో పులి తండ్రి రాంబో వచ్చి "మా టోటో నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. అతని కోసం అన్ని చోట్లా వెతికాను. కానీ కనుక్కోలేకపోయాను. అతన్నివెతకడంలో దయచేసి నాకు సహాయం చేయండి. అతనికి ఏమైనా జరిగి ఉండవచ్చు" ఆందోళనగా చెప్పాడు.
అందరూ విచారంలో మునిగారు. ఏం చేయాలి? రెండు మూడు నెమళ్లు గాల్లో ఎగురుతూ వెతకసాగాయి. టోటో పులి స్నేహితులైన ఎలుగుబంట్లు చెట్లెక్కి చూసాయి. కానీ నిరాశతో కిందికి దిగి వచ్చి “అంకుల్ అతను ఎక్కడా కనిపించడం లేదు. అయినా ఇంత దట్టమైన అడవిలో అంత దూరం ఎలా చూస్తాం?" అన్నాయి.
చంచల్ కుందేలు నిశ్శబ్దంగా జరిగిన సంఘటనంతా గమనించాడు. “నాకో ఆలోచన వచ్చింది. ఈ మకర సంక్రాంతికి మా డాడీ నాకు కెమెరాతో కూడిన ఒక తేలికైన పోన్ బహుమతిగా ఇచ్చాడు. సరిస్కాను అన్వేషించడానికి దాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది?” అన్నాడు.
చెట్టు మీద కూర్చున్న తోతారామ్ రామచిలుక “అయితే ఆ ఫోన్‌ను ఏం చేస్తావ్? చేతిలో పట్టుకుని ఏరియా మొత్తం వెతుకుతావా?” కోపంగా అడిగాడు.
“చూస్తూ ఉండు తోతారామ్”.
చంచల్ పొద వెనకాల ఉన్న తన గూడులోకి వెళ్లాడు. రెండు పెద్ద గాలిపటాలు, దారాలు, ఫోన్‌తో వెంటనే తిరిగి వచ్చాడు.
ఒక గాలిపటాన్ని స్నేహితుడు బల్లూ ఎలుగుబంటికి ఇచ్చి “ఇది పట్టుకోండి. మీరు ఒక గాలిపటం ఎగురవేస్తారు. మరొకటి నేను ఎగురవేస్తాను. మనం రెండు గాలిపటాల మధ్య దారాన్ని కట్టి దానికి ఫోన్ జోడించి ఆకాశంలో ఎగురవేస్తాం. దాన్ని ఆటో మోడ్‌లో ఉంచుతాం. ప్రతి 30 సెకన్లకు ఒకసారి ఇది అడవి పైనుంచి ఫోటోలు తీస్తుంది. ఇది మన అన్వేషణను వేగవంతం చేస్తుంది. టోటో ఎక్కడైనా ఉంటే మనకు వెంటనే తెలుస్తుంది”.
“కానీ, ఫోన్‌తో గాలిపటాలు ఎగరగలవా?” అడిగాడు బల్లూ.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.