అంకుల్, మీ దగ్గర ఏమైనా దెయ్యం కథల " పుస్తకాలు ఉన్నాయా?" పదేళ్ల అమయ్ పుస్తక దుకాణదారును అడిగాడు.
"నీకు దెయ్యాల కథలు చదివితే భయం వేయదా?” అని నవ్వుతూ అమయ్కి పుస్తకం ఇచ్చాడు పుస్తక దుకాణదారు.
“లేదంకుల్. నేనెంతో ధైర్యవంతుడిని" అంటూ అమయ్ వెళ్లిపోయాడు.
శరణ్, అజోయ్, సనాలు అమయ్ రాక కోసం వాళ్ల ఇంట్లో ఎదురు చూస్తున్నారు. పుస్తకం తీసుకుని అమయ్ అక్కడికి రాగానే నలుగురు స్నేహితులు దాన్ని తీసుకుని వెనుక గదిలోకి వెళ్లారు.
అమయ్ దెయ్యం కథలు చదవలేడని స్నేహితులు పందెం వేసుకున్నారు. ముగ్గురూ అతన్ని పిరికి వాడని నిరూపించాలని నిశ్చయించుకున్నారు.
పుస్తకంలో మర్రి చెట్టు దెయ్యం, బట్టతల దెయ్యం, మరుగుజ్జు దెయ్యం, లావు దెయ్యం, సన్నని దెయ్యం లాంటి పేర్లతో వివిధ రకాల కథలు ఉన్నాయి. చదువుతున్న కొద్దీ పిల్లల ముఖాల్లో రంగులు మారుతున్నాయి.
“తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలి అవుతున్నది” సనా అడిగింది.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏదైనా తెచ్చుకోవడానికి ఎవరు బయటికి వెళ్తారు? బయటకు వెళ్లాలంటే అందరూ భయపడ్డారు.
“నేను చెక్ చేస్తాను. ఫ్రిజ్లో ఏదైనా ఉండొచ్చు" అంటూ అమయ్ గిన్నెలో కొంత పాయసంని తెచ్చాడు. అయితే ఈ హడావిడిలో ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచాడు.
నలుగురు స్నేహితులు కలిసి పాయసంను తింటున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
ఇంటి బయట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై గోగో అనే చిన్న ఉడుత ఉండేది. ఆహార పదార్తాలతో నిండిన ఫ్రిజ్ తలుపు తెరిచి ఉండడం చూసి దాని నోట్లో నీళ్లు ఊరాయి.
"కోకో, అక్కడ చూడు. ఫ్రిజ్ లోపల చాలా ఆహారం ఉంది" అని గోగో తన స్నేహితురాలు కోకో అనే మరో ఉడుతతో చెప్పింది.
“వేరే వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లడం మంచి అలవాటు కాదు. నీకు ఆకలిగా ఉంటే చెట్టుపై పండిన పండ్లను తిను” అని కోకో చెప్పి తనూ పండ్లు తినసాగింది.
గోగోకు కోకో సలహా నచ్చలేదు. నిశ్శబ్దంగా చెట్టు దిగి వంటింట్లోకి వచ్చింది. ఎవరికైనా కనిపిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఫ్రిజ్లో కాస్త ఖాళీ స్థలం చేసుకుని లోపల దాక్కుంది.
లోపల ఉన్న పండ్లు, స్వీట్లు అన్నీ హాయిగా ఆరగించింది. ఫ్రిజ్ లోపల చాలా చల్లగా ఉంది.తిన్న వెంటనే దానికి నిద్ర వచ్చింది.
هذه القصة مأخوذة من طبعة August 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్