ఎలక్షన్ సీజన్
Suryaa Sunday|November 26, 2023
నాగావళి నదికి ఒడ్డున సంగంవలస అనే పెద్ద గ్రామమొకటి ఉంది. అక్కడే 5 సువర్ణముఖి, వేగావతి నదులు నాగావళిలో కలుస్తున్నాయి.
పిల్లా తిరుపతిరావు-7095184846
ఎలక్షన్ సీజన్

నాగావళి నదికి ఒడ్డున సంగంవలస అనే పెద్ద గ్రామమొకటి ఉంది. అక్కడే 5 సువర్ణముఖి, వేగావతి నదులు నాగావళిలో కలుస్తున్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణీసంగమం అంటారు. ఆ ప్రాంతమంతా ప్రాకృతికశోభతో అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండల నడుమ గుండా ప్రవహించే నదుల గలగలల సోయగాలు యాత్రికులను కనువిందు చేస్తుంటాయి. ఆ నదులకు ఆనుకుని ఉన్న పంటపొలాలు పచ్చదనంతో పలకరిస్తుంటాయి.అంత అందమైన సంగంవలస గ్రామంలో రాఘవవర్మ ఏకైక భూస్వామి.గతంలో వారి పూర్వీకులే రాజులూ జమీందారులూను. అక్కడ కొంతమేర శిధిలావస్థలో ఉన్న కోట ఒకటి ఉంది. ఆ కోటలో ఓ ప్రక్కన ఒక అధునాతన భవనం ఉంది. అదే రాఘవవర్మ నివాసం.

వర్మ సంగంవలస నియోజకవర్గానికి గతసారి జరిగిన సాధారణ ఎన్నికలలో శాసనసభ్యునిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో వారి తాత మాధవవర్మ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వారి తండ్రి విక్రమవర్మ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా కూడా పదవిని అలంకరించారు.ఒకప్పుడు వారి తాతదండ్రుల్లా నేడు వీరికి గెలుపేమి సునాయాసం కాదు.ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వారి సామాజిక వర్గం ఉండేది.బహుస్వల్పమే. నేడు బహుజన సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఆయా వర్గాలు ఐక్యంగా పనిచేయడంతో జనాభాపరంగా తక్కువ ఉన్న అగ్రవర్ణాల గెలుపేమి ఇంతకుమునుపులా సులువు కాదు. అందువల్లనే వర్మ గత ఎన్నికల్లో పోటీచేసి ఓ సామాన్యుడి చేతిలో ఓడిపోయాడు.ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బహుజన వర్గానికి చెందిన ఓ సామాజిక వర్గం రాజకీయాలను బాగా శాసిస్తున్నది. అందువల్ల అగ్రవర్ణ వర్గాలకు చెందిన రాఘవవర్మ గెలుపు ఆనాడు అసాధ్యమైంది. కానీ వర్మ ఈసారైనా గెలిచి ఎమ్మెల్యే కావాలని తహతహలాడుతున్నాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగో ఒకలాగా విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాడు.డబ్బు అంతకు పదింతలు విరజల్లాలనే ఆలోచనతో ఉన్నాడు. తన తండ్రీతాతల్లా గెలిచి తన సత్తా ఏంటో అందరికీ చాటాలనుకుంటున్నాడు.అయితే ఒకవైపు తనకు గెలుపు సాధ్యం కాకపోవడం పట్ల బాధతో ఉన్నాడు.

هذه القصة مأخوذة من طبعة November 26, 2023 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 26, 2023 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA SUNDAY مشاهدة الكل
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
Suryaa Sunday

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం

పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.

time-read
3 mins  |
November 03, 2024
'అమరన్' సినిమా రివ్యూ,
Suryaa Sunday

'అమరన్' సినిమా రివ్యూ,

శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

time-read
2 mins  |
November 03, 2024
'బఘీర'
Suryaa Sunday

'బఘీర'

కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.

time-read
2 mins  |
November 03, 2024
గుల్ మొహర్..
Suryaa Sunday

గుల్ మొహర్..

గుల్ మొహర్..

time-read
4 mins  |
November 03, 2024
ఈ వారం కధ
Suryaa Sunday

ఈ వారం కధ

క్యూ లైన్

time-read
2 mins  |
November 03, 2024
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
Suryaa Sunday

పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు

పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం

time-read
1 min  |
November 03, 2024
సుమతీ శతకం
Suryaa Sunday

సుమతీ శతకం

సుమతీ శతకం

time-read
1 min  |
November 03, 2024
FIND 10 DIFFERENCES
Suryaa Sunday

FIND 10 DIFFERENCES

FIND 10 DIFFERENCES

time-read
1 min  |
November 03, 2024
సూర్య- fill colour
Suryaa Sunday

సూర్య- fill colour

సూర్య- fill colour

time-read
1 min  |
November 03, 2024
సూర్య- match the items
Suryaa Sunday

సూర్య- match the items

సూర్య- match the items

time-read
1 min  |
November 03, 2024