ప్రపచ వ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో, ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించడం.. దీంతో కొంతమంది మరణించడం మరెందరో గాయాలు పాలవడం తరచూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు పరిశ్రమల్లో, సినిమా థియేటర్లలో, సర్కస్ లో, క్లబ్లో, హెూటల్లో, ఆసుపత్రిలో జరుగుతూ ఉంటాయి. వ్యక్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బాధ వర్ణనాతీతంగా కనపడుతుంది. గాయాల పాలైన వారి పరిస్థితి హ్రుదయం విదారకంగా ఉంటుంది.. తరచూ జరిగే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు మానవ తప్పిదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, సరైన ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం, ప్రమాదకరమైన పదార్థాలు వలన మరికొన్ని ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. పారిశ్రామికీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా పని చేసే క్రమంలో నైపుణ్యాలు లేకపోవడం, అవగాహన లేమితో ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక విందు వినోదాల కార్యక్రమాల్లో అనగా సినిమా థియేటర్లలో, సర్కస్లో, క్లబ్లో, పబ్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారణకు చర్యలు తీసుకోవాలి..అయితే ఈ సందర్భంగా గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలు గూర్చి పరిశీలన చేద్దాం.
(ఐ.ప్రసాదరావు 6305682733)
1.. ట్రయాంగిల్ షార్ట్ వైస్ట్ ఫ్యాక్టరీ ఫైర్...
అమెరికా లోని మన్ హట్టన్ వద్ద “ట్రయాంగిల్ షార్ట్ వైస్ట్ ఫ్యాక్టరీ" లో మార్చి 23వ తేదీన 1911లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 146 మంది మరణించారు. అనేక మంది గాయాలు పాలవడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలు ( మంట రగిల్చే గుణం గలవి) అని తెలియవచ్చింది. . ఈ దుర్ఘటన జరిగిన ప్రభుత్వం అప్రమత్తమై, కార్మికుల భద్రత కొరకు " కార్మిక చట్టాలు ( లేబర్ లాస్)” తయారు చేసి అమలు చేయడం ప్రారంభించారు.
2. రిథమ్ క్లబ్ ఫైర్..
“మిసిసిపి”లో రిథమ్ క్లబ్ లో ఏప్రిల్ 28వ తేదీన 1940లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 209 మంది మరణించారు. దీనికి ప్రధాన కారణం మానవ తప్పిదమే అనగా వెలిగించిన సిగరెట్ ఆవరణలో పడేయడంతో అక్కడ ఉన్న వస్తువులు అంటుకుని భారీ అగ్నిప్రమాదానికి కారణం అయిందని తెలియవచ్చింది.
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Suryaa Sunday.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.