కాస్ట్లీ పెళ్లిళ్లు కష్టాల కావిళ్లు
Vaartha-Sunday Magazine|July 23, 2023
మానవజాతి మనుగడలో, పురోగతిలో స్త్రీ, పురు షుల సంగమం అనివార్యమైన ప్రక్రియ అయితే అందుకు ఊపిరిలూదుతున్న వివాహవ్యవస్థ పాత్ర వెలకట్టలేనిదే.
కాస్ట్లీ పెళ్లిళ్లు కష్టాల కావిళ్లు

మానవజాతి మనుగడలో, పురోగతిలో స్త్రీ, పురు షుల సంగమం అనివార్యమైన ప్రక్రియ అయితే అందుకు ఊపిరిలూదుతున్న వివాహవ్యవస్థ పాత్ర వెలకట్టలేనిదే. మనదేశ సాంప్రదాయ సామాజిక వ్యవస్థకు బలమైన పునాదిగా కొనసాగుతున్న వివాహవ్యవస్థ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా భావించక తప్పదు.

వేదకాలం నుండి వర్తమానం వరకు మానవ నాగరికత మనుగడకు మూలాధారంగా కొనసాగుతున్న వివాహబంధం ఇరువురి మనుగడకు అవసరమైనప్పటికీ ఈ సంబంధం సృష్టికోసం, దాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం, అడుగడుగునా స్త్రీ అణిగిమణిగి వుండాల్సి రావడమే కాదు, ఆమెతోపాటు ఆమె కుటుంబం కూడా సామాజిక చిన్నచూపుకు, ఆర్థిక దోపిడికి గురికావాల్సి వస్తున్నవైనం శోచనీయమే. నాటి నుండి నేటివరకూ వివిధ వైవాహిక సంబంధిత సాంప్రదాయాల నెపంతో వరుడి కోణంలో ఆలోచించినప్పుడు ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు, ఓ వివాహం అతని, అతని కుటుంబానికి సంబందించిన సకల ఆర్థిక సమస్యల పరిష్కారానికి మార్గంగా మారుతోందనిపిస్తోంది. భారతదేశంలో వివాహవ్యవస్థ మూలాలలోకి వెళ్లి పరిశీలించినప్పుడు వివాహ సందర్భంగా వధువు తల్లిదండ్రులు తమ కూతురి మంచి కోరుతూ స్వచ్చందంగా తమ ఆర్థికశక్తి అనుమతించిన మేరకు కానుకలు ఇవ్వడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఈ సాంప్రదాయమే ఆచరణలో ఓ భ్రష్టాచారంగా

రూపుదాల్చి వధువు కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా వరుడితోపాటు, ఆయన కుటుంబం తాలూకు గొంతెమ్మ కోరికలను తీర్చుకునే పైలట్ ప్రాజెక్టుగా మారి

అత్తారింటిలో వధువుపై వరకట్న వేధింపులకు, గృహహింసకూ దారితీస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. వరకట్నం ఓ సామాజిక దురాచారంగా మారిన క్రమంలో ప్రభుత్వం అనివార్యంగా దానిని కూకటివేళ్లతో పెకిలించడానికి 1960వ సంవత్సరంలోనే వరకట్న నిషేధచట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఓ భ్రష్టాచారమే. సామాజిక నేరమే. అది తీసుకునే వారు చట్టరీత్యా నేరస్తులే కాదు శిక్షార్హులు కూడానని చెప్పక తప్పదు. ఈ సాంప్రదాయమే వరకట్న పిశాచిగా రూపాంతరం చెంది ఈదేశంలో మహిళలపై పెచ్చుమీరుతున్న అమానవీయ హింసకు సింహభాగం తానే కారణంగా మారుతున్న వైనాన్నిఏఏటికాయేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తేల్చి చెప్తున్నాయి.ఇంత జరిగినా స్వతంత్ర భారతదేశంలో జారీ చేయబడిన అన్ని చట్టాలలోకెల్లా ఆచరణలో అమలుకు నోచుకోని అగ్రగామి చట్టంగా వరకట్న నిషేధచట్టం అపకీర్తిని మూటగట్టుకొని చేష్టలుడిగి చూస్తోంది.

هذه القصة مأخوذة من طبعة July 23, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 23, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 mins  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024