తిరువారూర్ అనే పేరు వినగానే కర్ణాటక 'సంగీతప్రియులకు సంగీతమూర్తులుగా పేరు గాంచిన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి పేర్లు గుర్తుకు వస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ త్యాగరాజస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది.
ఈ క్షేత్రం ఎక్కువ ఉపాలయాలతో విరాజిల్లుతోంది. ఇక్కడ అతిపెద్ద పుష్కరిణి ఉంది. అలాగే త్యాగరాజేశ్వర స్వామికి పెద్ద రథం ఉంది.తిరువారూరులో అడుగు పెట్టగానే మనకి భక్తిభావన, సుగంధ ధూపాల సువాసనలు, దేవాలయ గోపురాలు కలసి ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది.
ఈ దేవాలయంలోని ఎన్నో విశేషాలు, ఇక్కడి శిల్పకళా చాతుర్యం మనల్ని అబ్బురపరుస్తుంది. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం చోళన్ రాజ వంశీకుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జ జరిగిందని అంటారు. ప్రధాన దేవాలయం లోపల సన్నిధానం అని పిలవబడే పెద్ద ఉప దేవాలయాలు ఉన్నాయి. అలాగే వేయి స్థంభాల శిల్ప కళా చాతుర్యం చూసి తీరాల్సిందే.
దేవాలయ ప్రవేశంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి సన్నిధి, వేయి కాళ్ల స్తంభాలను చూడడం విశేషం. ఆ పక్కనే రథాన్ని నడుపుతున్న రాజు, చక్రాల కింద ఆవుదూడ ఉన్న శిల్పం మనకి కనిపిస్తుంది. దీనికి ఒక కథ ఉంది. రాజు గారి కోట ముందు పెద్ద ఓ గంట వేలాడదీశారు. ప్రజలకి ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా ఈ గంట మోగిస్తే వెంటనే సహాయం అందిస్తారు రాజుగారు.
ఒకరోజు యువరాజు గారి రథ చక్రాల కింద పడి ఆవుదూడ చనిపోయింది. దాని తల్లి ఆవు వచ్చి గంట మోగించింది. రాజు వివరాలు తెలుసుకుని యువరాజుని కూడా అదే రథ చక్రాల కింద వేసి మరణశిక్ష విధించారు. రథ చక్రాలు యువరాజు మీదకి వచ్చేసరికి యమధర్మరాజు ప్రత్యక్షమై "రాజా! నేను పెట్టిన పరీక్షలో గెలిచావు. నేనే ఆవుని. నీ ధర్మాన్ని పరీక్షించాను” అన్నాడు.
ఇక్కడ యమధర్మరాజు యమ చండికేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు.అంటే ఇక్కడ త్యాగరాజేశ్వర దర్శనం ముక్తి మార్గమని సంకల్పం.
هذه القصة مأخوذة من طبعة August 20, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 20, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..
నువ్వా.. నేనా!
అమెరికాలో హోరాహోరీ
'సంఘీ భావం
మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.
తాజా వార్తలు
తక్కువ హోంవర్క్ ఉండాలి
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య