మౌంట్ ఫ్యాన్జింగ్?
ఆకాశాన్ని తాకుతున్నదా? అని భ్రమింపజేసే సహజసిద్ధమైన రెండుగా చీలిన రాతి శిఖరంపై రెండు బౌద్ధ ఆలయాలను నిర్మించారు. నిటారుగా ఉండే ఈ రాతి శిఖరం పైభాగాన రెండుగా చీలి రెండు శిఖరాల వలె కనిపిస్తాయి. ఇవి ఆకాశాన్ని తాకుతున్నాయా? అనేలా చూపరులకు భ్రమను కల్పిస్తాయి. చైనాలోని గుయిజౌ ఫ్రావిన్స్ లోని వులింగ్ పర్వతశ్రేణిలో నెలకొన్న ఈ రాతి శిఖరాల పై భాగాన్ని రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్, ఫాన్జింగ్హాన్’ అని పిలుస్తారు. ఈ ఆలయాలకు వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో ఈ ఆలయాలను ఇంత ఎత్తు శిఖరాలపై ఎలా నిర్మించారనేది నేటికీ వింతగానే మిగిలింది. బౌద్ధ ఆలయాలను చాలా ఎత్తులో నిర్మించారు. ఇంత ఎత్తులో బలమైన ఈదురు గాలులు వీస్తుంటాయి. నిత్యం ప్రతికూల వాతావరణం ఉంటుంది.ఇటువంటి ప్రకృతిని తట్టుకుని ఆకాశాన్ని తాకే అనుభూతి కలిగేంత ఎత్తులో ఈ ఆలయాలను ఎలా నిర్మించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.సముద్ర మట్టానికి 8430 అడుగుల ఎత్తులో ఈ పర్వతంపై నిర్మించిన ఈ ప్రాంతాన్ని యునెస్కోవారు 2018లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించి ప్రకటించారు. మెట్ల మార్గంలో నడవలేని వారి కోసం కేబుల్కర్ల అందుబాటులో ఉంటాయి. శిఖరం పైభాగాన ఉన్న ఈ ఆలయాలను చేరుకోవాలంటే దాదాపు ఎనిమిది వేల మెట్లను ఎక్కాలి. అక్కడ స్వర్గాన్ని తలపించే బౌద్ధ ఆలయాలు కనిపిస్తాయి. ఇది ఆధ్యాత్మికతతో కూడిన సాహస యాత్ర అనే చెప్పాలి. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళితే తొలుత దక్షిణం వైపు ఉన్న బుద్ధుని ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శిఖరంపైన నిర్మించిన వంతెన దాటి ఉత్తరం వైపు వెళితే మైత్రేయ ఆలయం చేరుకోవచ్చు.వంతెన దాటే సమయంలో ఆకాశంలో విహరిస్తున్నట్లు, మేఘాలు తాకుతున్నట్లు వింత అనుభూతులు కలుగుతాయి. ఇది ఒకే పర్వతం అయినప్పటికీ మధ్యలో రెండుగా చీలి రెండు శిఖరాలుగా ఏర్పడటంతో రెండు పర్వతాలను చూసిన అనుభూతి కలుగుతుంది. రెండు శిఖరాలపై రెండు బౌద్ధ ఆలయాలు ఉన్నాయి.
هذه القصة مأخوذة من طبعة January 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 21, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.