‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం. కొబ్బరి మొక్కకు తొలి సంవత్సరం ఇచ్చిన నీటితోనే అది పెరిగి, ఉపకారాన్ని మరవకుండా, తాను ఎన్నో కాయలతో నిండుగా అమృతతుల్యమైన జలాలను జీవితాంతం ఇస్తూనే ఉంటుంది. సత్పురుషులకు కాస్తంత ఉపకారం చేసినా, వారు విస్మరించకుండా అంతకు ఎన్నో రెట్ల కృతజ్ఞతతో ప్రత్యుపకారం చేస్తారు.
ఎదుటివారి నుండి ఏ సహాయం పొందినా దాన్ని మరువకుండా కృతజ్ఞ తతో ఉండాలి. అలాంటి కృతజ్ఞతా భావం సమాజమంతా విస్తరిల్లుతున్ననాడు ఎక్కడా అశాంతి ఉండదు. పూర్వకాలంలో కృతజ్ఞతా భావంతో మెలిగేవారు అధికంగా ఉండేవారు. కురువృద్ధుడు, భీష్మపితామహుడు ఈ విషయం గురించి తనకు తెలిసిన ఓ కథను ధర్మరాజుకు ఇలా చెప్పాడు.
పూర్వం ధర్మాత్ముడైన వత్సనాభుడనే రుషి ఉండేవాడు. ఓసారి ఆయన తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. ఆయన చుట్టూ ఎంతో ఎత్తున పుట్టలు పెరిగాయి. అలా ఆయన తపస్సు సాగిస్తూ ఉండగా భీకరంగా వర్షం కురవటం ప్రారంభమైంది.
చాలాకాలం నుండి ఆ పరిసరాల్లోనే ఉన్న ధర్మదేవత వత్సనాభుడిని గమనిస్తుండేది. ఆయన చేస్తున్న తపస్సుకు వర్షాలు భంగం కలిగిస్తాయని తలచి, తాను ఒక పెద్ద మహిషంగా మారి పుట్టపైన గొడుగుగా నిలుచుంది. ఏడు రోజులపాటు కృత ధారాపాతంగా వర్షం కురిసినా పుట్ట పాడవకుండా, తపస్సుకు భంగం వాటిల్లకుండా ఆచ్ఛాదనగా ధర్మదేవత, మహాభారీకాయంగల మహిష రూపంలో రుషిని రక్షించింది. వాన తగ్గాక, ఆ దున్న పక్కకు తొలగింది.
هذه القصة مأخوذة من طبعة July 07, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 07, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
గాంధీజీపై డాక్యుమెంటరీ
జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.
బాలగేయం
పండుగ వేళ..
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
నక్కకు గుణపాఠం
కథ
కొన్ని దేశాల ప్రత్యేకతలు
దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.
దేశపరిణామాలను వివరించే పుస్తకం
పుస్తక సమీక్ష
నిశాచరుడి దివాస్వప్నం
పుస్తక సమీక్ష
కృష్ణాజిల్లా సాహిత్య అక్షర తరంగీణి
పుస్తక సమీక్ష
ఆలితో సరదాగా హాస్య నాటికలు
'నవ్వు' అనే మందు తయారు చేయటం కష్టమైనా, నాకు ఇష్టం' అంటారు 'ఆలితో సరదాగా' హాస్య నాటికల రచయిత అద్దేపల్లి భరత్ కుమార్.
నాన్న నానీలు
ఈ వారం కవిత్వం