రాణీ రుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు మూడున్నర దశాబ్దాల పాటు ఓరుగల్లు (వరంగల్) రాజధానిగా చేసుకొని తెలుగువారి బావుటాను ఎగురవేశారు. ఢిల్లీ నవాబు తుగ్లక్ సేనల చేతిలో ఓటమిపాలై శత్రువులకు బందీగా చిక్కి అవమానభారం తట్టుకోలేక నర్మదా తీరంలో ఆత్మహత్య చేసుకొన్నారని శాసనాలు, చరిత్రకారుల వల్ల తెలుస్తోంది.
ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. ఆ తరువాత కొంత కాలం ఆంధ్రజాతి సరైన పాలకులు లేక యుద్ధాలతో అల్లకల్లోలంగా మారిపోయింది అని చరిత్ర చెబుతున్న విషయం. ఆ సమయంలో ముసునూరి నాయక, రాచర్ల నాయక వంశాలు నేటి తెలంగాణాలో మొగ్గ తొడిగాయి.కాకతీయ పాలకుల వద్ద సేనాపతులుగా ఎన్నో యుద్ధాలలో పాల్గొన్న రెడ్డి వంశంవారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నేటి ప్రకాశం జిల్లాలోని అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజుల సామ్రాజ్యానికి పునాది వేశారు.
మహామండలేశ్వరునిగా పిలవబడిన ప్రతాపరుద్రుని డెబ్భై ఏడు మంది నాయకులలో ప్రముఖులు ముసునూరి వంశ పాలనకు మూలమైన కాయప నాయకుడు, రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి.
ముసునూరివారు, రాచర్లవారు కొద్ది కాలమే పాలన చేయగలిగారు. రెడ్డి రాజులు మాత్రం సుమారు శతాబ్ద కాలానికి పైగానే తమ ప్రభావాన్ని ఆంధ్ర ప్రాంతాలలో కాకుండా తమిళ, ఓడ్ర దేశాల పైన కూడా చూపించారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.
తొలుత అద్దంకి రాజధానిగా చేసుకొన్నా రాజకీయంగా అది సరైన ప్రాంతం కాదని తగిన అనువైన ప్రదేశం కోసం అన్వేషించి, చివరకు చుట్టూ పర్వతాలతో వున్న సురక్షితమైన కొండవీటి ప్రాంతాన్ని ఎంచుకొన్నారు. పటిష్టమైన కోటను నిర్మించుకున్నారు. వారి అంచనా తప్పలేదు. ఆనతి కాలంలోనే కొండవీడు శత్రుదుర్బేధ్యం అన్న పేరు పొందింది.రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి తప్ప మిగిలినవారు అంతా. కోట నుండే పాలన సాగించారు.తొమ్మిది మంది రెడ్డి రాజులలో ఎనిమిది మంది కొండవీడును తమ రాజధానిగా చేసుకొని కంచి నుంచి కటకం వరకు సువిశాల ప్రాంతాన్ని పరిపాలించారు.ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అయిన అనవోతారెడ్డి కాలంలో కొండవీటి కోట నిర్మాణం పూర్తి అయ్యి రాజధాని అద్దంకి నుండి కొండవీడుకు మార్చబడింది.
هذه القصة مأخوذة من طبعة September 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 15, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.