మనోదేహ సంబంధం
Heartfulness Magazine Telugu|January 2024
యోగ పరిశోధనలను ప్రోత్సహించేందుకు 'అంతర్జాతీయ యోగా థెరపిస్ట్ ల సంఘం’లో ‘సింపోజియమ్ ఆన్ యోగా రీసర్చ్' నిపుణుల వార్షిక సదస్సుకు సైంటిఫిక్ డైరెక్టరుగా ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.
మనోదేహ సంబంధం

సత్ బీర్ సింగ్ ఖల్సా, పీ హెచ్ డీ, కుండలినీ పరిశోధనా కేంద్రానికి డైరెక్టరు; బెన్సన్ హెన్రీ ఇన్స్టిట్యూట్ ఫర్ మైండ్ బాడీ మెడిసన్ లో రీసర్చ్ అసోసియేట్; ఓషర్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటివ్ మెడిసన్ లో రీసర్చ్ అఫిలియేట్; హార్వర్డ్ మెడికల్ స్కూల్ లోని బ్రిగం అండ్ ఉమెన్స్ హాస్పిటల్ లో అసోసియేట్ ప్రొఫెసర్.వారు 2001 నుండి యోగాపై పరిశోధనలు జరిపారు. 1973 నుండి కుండలిని యోగ పద్దతిలో సాధకుడు మరియు బోధకుడు. తమ పరిశోధనలలో నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడులు; పని ప్రదేశాలు మరియు పబ్లిక్ స్కూళ్ళ వాతావరణంలో ఆందోళన సంబంధ లోపాలు మొదలైన అంశాలలో యోగ పద్ధతుల ప్రభావాన్ని మూల్యాంకనం చేశారు. యోగ పరిశోధనలను ప్రోత్సహించేందుకు 'అంతర్జాతీయ యోగా థెరపిస్ట్ ల సంఘం’లో ‘సింపోజియమ్ ఆన్ యోగా రీసర్చ్' నిపుణుల వార్షిక సదస్సుకు సైంటిఫిక్ డైరెక్టరుగా ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా థెరపీ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా సేవలు అందిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ రిపోర్ట్ 'ఇంట్రడక్షన్ టు యోగ’ కు వారు మెడికల్ ఎడిటర్ గా ఉన్నారు.‘ద ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగ ఇన్ హెల్త్ కేర్' మెడికల్ టెక్స్ట్ బుక్ కి ప్రధాన ఎడిటర్. వారితో హార్ట్ ఫుల్ నెస్ విక్టర్ కణ్ణన్ జరిపిన సంభాషణలో యోగా మరియు శ్రేయస్సు అంశాలు రెండూ కలవడాన్ని గురించి అడిగి తెలుసుకుంటారు.

సాంప్రదాయక యోగాలోని నాలుగు అంశాలు

ప్రశ్న: డాక్టర్ ఖల్సా గారూ, మీరు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ పదజాలంలో యోగా అంటే ఏమిటి?

నేను పిలిచే “సాంప్రదాయక యోగా” లేదా “చారిత్రిక యోగా” పై దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తున్నాను. దానిలో నాలుగు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఆసనాలు అంటే శారీరక భంగిమలు మరియు వ్యాయామాలు ఉన్నాయి. చాలామంది ఈ ఆసనాలు, వ్యాయామాలు సాధన చేయడం మినహా ఇంకేమీ చేయరు. దాన్నే వారు యోగా అంటారు. సరే, మంచిదే. వారు సాధన చేస్తున్నదంతా అంతవరకే అయితే అది ప్రధానంగా పరిమితమైన యోగా మాత్రమే అవుతుంది. అది కేవలం యోగాలో ఒక కోణం మాత్రమే అవుతుంది.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.