నిద్రలేమి - దయ్యం మేల్కొలుపు
Heartfulness Magazine Telugu|January 2024
స్టనిస్ లజుగి నిద్రకు సంబంధించిన ఆరోగ్య రక్షణలో చాలా స్పష్టమైన పరిశోధనల ఫలితాలను గురించి తెలియచేస్తూ; రాత్రి వేళ విశ్రాంతికరమైన నిద్ర ఎందుకంత ముఖ్యమో వివరిస్తారు.
నిద్రలేమి - దయ్యం మేల్కొలుపు

స్టనిస్ లజుగి నిద్రకు సంబంధించిన ఆరోగ్య రక్షణలో చాలా స్పష్టమైన పరిశోధనల ఫలితాలను గురించి తెలియచేస్తూ; రాత్రి వేళ విశ్రాంతికరమైన నిద్ర ఎందుకంత ముఖ్యమో వివరిస్తారు. కొన్ని గంటల నిద్రను పోగొట్టుకోవడం సరియైన అవగాహన కాదని మనల్ని కచ్చితంగా ఒప్పిస్తారు.

రాత్రి సుఖనిద్ర లేక పీడకలల పగలు

"సుఖనిద్ర" ఒక మౌన వీరుడు. కార్యనిర్వహక హోదాల్లో ఉన్నవారి ఆలోచనా ప్రక్రియను చురుకైన మానసిక ప్రక్రియలు, అనుకూలత, సృజనాత్మక ఆలోచనలు మొదలైన లక్షణాలతో వర్ణించవచ్చును. ఇవి పునరుత్తేజాన్నిచ్చే నిద్రపై ఆధారపడి ఉంటుంది.

కాని, దురదృష్టవశాత్తూ, మన ఆధునిక విద్యా వ్యవస్థలు, వృత్తి జీవితాలలో నిద్ర యొక్క ప్రాముఖ్యత - దాని పరిమాణము మరియు నాణ్యత రెండూ నిద్ర లేకపోవడం మన ఆరోగ్యం మరియు మనస్సుపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలను చూపుతుందో చరిత్ర పదేపదే గుర్తు చేస్తున్నప్పటికీ - తరచుగా అలక్ష్యం చేయబడ్డాయి. నిజానికి, ఇది చరిత్ర అంతటా చిత్రహింసలు పెట్టేందుకు ఉపయోగించబడింది.

16వ శతాబ్దపు కాలం స్కాట్లాండ్, మంత్రగత్తెల వేట ముమ్మరంగా ఉన్నప్పుడు, మంత్ర విద్యను ఉపయోగించినట్లు ఆరోపించబడిన స్త్రీలను పట్టుకుని విచారించడం జరిగేది. నేర నిర్ధారణకు ముందు దోషులు నేరాన్ని అంగీకరించడం అవసరం.

ఆ విధంగా "మంత్రగత్తెను నిద్ర లేపడం" అనే మాట వాడుక లోకి వచ్చింది. నిందితులైన స్త్రీలను రోజుల తరబడి నిద్ర పోనీయకుండా ఉంచేవారు. దాని వల్ల వారు మతి భ్రమలను, మనోవికారాలకు సంబంధించిన సన్నివేశాలను అనుభవించడం ప్రారంభించేవారు.

అభివృద్ధి చెందిన దేశాల అంతటా వయోజనులలో మూడింట రెండు వంతుల మంది, ఒక రాత్రికి సిఫార్సు చేయబడిన ఏడు నుండి ఎనిమిది గంటల మొత్తం నిద్ర పోవడంలో విఫలమవుతున్నారు.అప్పుడు వారితో జరిపిన "సంభాషణ" నేర అంగీకారంగా నమోదు చేయబడేది.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.