వేసవి సెలవులు ముగిసాయి. సెలవుల్లో చందనవనం వాసులంతా తమ హాబీలను నెరవేర్చుకోవడంలో నిమగ్నమై ఉంటే, రోరో కుందేలు మాత్రం చదువుకుంటూ బిజీగా గడిపాడు.
ప్రతిరోజులాగే మ్యాథ్స్ ప్రశ్నలను పరిష్కరిస్తున్నప్పుడు పాలీ ఎలుక అతని దగ్గరికి వచ్చాడు.
“రోరో, నీ పుస్తకాలను పక్కన బెట్టు. మనం పిక్నిక్కి వెళుతున్నాం” అని చెప్పాడు.
"పాలీ, నేను రాలేను. నాకు గణితం అంటే ఎంతిష్టమో నీకు తెలుసు కదా. నేను వే
కొన్ని గణిత సమస్యలను పూర్తి చేయాలనుకుంటున్నాను”.
“నా మాట ఎందుకు వినవు? నువ్వు నడిచి రాలేకపోతే ఎల్మో ఏనుగును ఇక్కడికి పిలిపిస్తాను.నిన్ను తొండంతో ఎత్తుకుని మాతో తీసుకువస్తాడు” అని చెప్పి పాలీజేబులో నుంచి ఫోన్ బయటకు తీసాడు.
రోరో భయపడ్డాడు. “ఓహ్ నో, ఎల్మోకు ఫోన్ చేయకు. నేను నీతో వస్తాను" అన్నాడు రోరో.
“ఇది బాగుంది! మేము అన్ని ఏర్పాట్లు చేసాం కాబట్టి నువ్వు ఏమీ తీసుకురానవసరం లేదు. మాతో వస్తే చాలు” అన్నాడు పాలీ. రోరో అతనితో కలిసి పార్క్లో తన కోసం ఎదురుచూస్తున్న టోటో తాబేలు, ఎల్మో ఏనుగుల దగ్గరికి వెళ్లాడు.
తమ బాక్సులు తీసుకుని అందరూ పిక్నిక్ స్పాట్వైపు బయలుదేరారు. ఎంతో సరదాగా గడిపారు. పాలీ, ఎల్మో తాము వెళ్లిన ప్రతి చోట
సెల్ఫీలు తీసుకున్నారు. తిరుగుతూ, అలిసిపోయిన తర్వాత ఒక ప్రదేశంలో కూర్చుని లంచ్ చేసారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు. టోటో తన ఫోనులో గేమ్స్ ఆడసాగాడు.
సాయంత్రం కావస్తోంది. తిరిగి వెళ్లాల్సిన సమయం. తమ సామానంతా సర్దుతుండగా వారికి ఒక వింత శబ్దం వినిపించింది.
“ఏమిటా శబ్దం?” అడిగాడు పాలీ.
“పాలీ నా అంచనా నిజమే అయితే, మనం ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నాం. ఆ శబ్దం ఇటువైపు వస్తున్న మొసళ్లది” భయపడుతూ చెప్పాడు.
టోటో.
"మొసళ్లా? కానీ అవి ఈ దారిలో ఎందుకు వస్తున్నాయి” అడిగాడు పాలీ భయంగా.
"పాలీ, మనం ఇక్కడ ఉన్నట్లు అవి తెలుసుకున్నాయి. మనల్ని తినటానికి వస్తున్నాయి.
ఇక్కడి నుంచి పరుగెత్తాలి” వణుకుతూ చెప్పాడు టోటో.
“కానీ టోటో, నువ్వు మెల్లగా నడుస్తావు కదా”.
"నేను టోటోను ఎత్తుకుంటాను” అన్నాడు ఎల్మో.
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.