" హేజానీ, ఎక్కడికి వెళ్తున్నావు?" అడిగాడు చీకూ
"హే "నీకు తెలియదా? ఈ రోజు ఫారెస్ట్ పార్లమెంట్లో స్పెషల్ బిల్లుపై చర్చ జరగబోతుంది.
నేను వెళ్లి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఆ బిల్లుపై జరిగే చర్చ వినాలనుకుంటున్నాను” బదులిచ్చాడు జానీ జిరాఫీ.
"ఏ బిల్లు జిరాఫీ?”
“చీకూ, నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది.
అడవిలోని మొసళ్లు చెరువులపై తమ హక్కును ప్రకటించుకున్నాయి. అందులోని నీటిని భూమ్మీద జీవులు వాడుకోనివ్వడం లేదు. అందుకే అటవీశాఖ దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ ఊటలు, చెరువులు, నదులపై హక్కు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టబోతోంది”. “సరే, ఇది చాలా ముఖ్యమైన బిల్లులా ఉంది. నేనూ ఆ చర్చ వినడానికి వస్తాను.”
“అయితే నాతో రా, పద”.
జానీ, చీకూలు ఫారెస్ట్ పార్లమెంట్ జరిగే స్థలానికి వెళ్లారు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నారు. లోక్సభ స్పీకర్ మంటూ జింక బిల్లుపై చర్చ ప్రారంభించారు.
చర్చ జరుగుతున్నప్పుడు మొసళ్ల మద్దతుదారుడు ప్రభుత్వ వ్యతిరేకి అయిన కుకూ పీత మాట్లాడుతూ “గౌరవనీయులైన స్పీకరుగారూ, భూమిపై నివసించే జంతువులకు దానిపై ఉన్న ప్రతిదానిపై హక్కు ఉంటుంది. అలాంటప్పుడు జలచరాలకు చెరువులు, నీటి బుగ్గలు, నదులపై ఎందుకు ప్రత్యేక హక్కులు ఉండకూడదు?” అని ప్రశ్నించాడు.
దీనికి జెరెమీ ఏనుగు నిరసన తెలియచేస్తూ “గౌరవనీయులైన స్పీకర్గారూ, నేను కుక్కూతో పూర్తిగా విభేదిస్తున్నాను. ఒకవేళ అలా జరిగితే, మేము అంటే ఏనుగులం దాహంతో చచ్చిపోతాం. స్నానం చేయడానికి, జలక్రీడల కోసం మేం ఎక్కడికి వెళ్లాలి?” అని అడిగాడు.
“నీళ్లలో ఆడుకునే బదులు దుమ్ముధూళిలో ఆడుకోవాలి" అన్నాడు బెన్నీ నక్క వెనుక నుంచి. దాంతో సభ అంతా నవ్వులతో నిండిపోయింది.
స్పీకర్ మంటూ సైతం నవ్వాడు. కానీ వెంటనే సర్దుకుని “బెన్నీ మేము ఒక తీవ్రమైన అంశాన్నిచర్చిస్తున్నామని నీకు తెలుసు. అయినా జోకులు వేస్తున్నావు" అన్నాడు.
తర్వాత స్పీకర్ మంటూ కోకో తాబేలును మాట్లాడమని చెప్పాడు. బిల్లును వ్యతిరేకిస్తూ అతను మాట్లాడాడు.
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!