అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు. అగ్ని అత్యుత్తమ సేవలను గుర్తించిన “అరోరా వ్యాలీ ఫైర్ డిపార్ట్మెంట్' అతనికి ఒక మెడల్ ఇచ్చింది.
అగ్ని చిన్నప్పటి నుంచే అగ్నిమాపక సిబ్బంది, అగ్ని మాపక వాహనాలను చూసి వాటిపై ఆకర్షితుడయ్యాడు. అగ్ని మాపక సిబ్బంది లో తాను 'ఫైర్ ఫైటర్' కావాలని అతని కోరిక. ఈ మెడల్ అందుకున్న సమయంలో తన కల సాకారం చేసుకోవడానికి జరిపిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నప్పుడు అతని కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి.
చిన్నప్పుడు అగ్నిని చూసి అందరూ పొట్టిగా ఉన్నావని, ఎలుగుబంటి కంటే చిన్నగా ఉన్నావంటూ వేధించేవారు.
స్కూలులో, ప్లే గ్రౌండ్లో అతన్ని ‘పొట్టోడా' అని ఎగతాళి చేసేవారు.
మీటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నప్పుడు తన జీవితంలోని చేదు సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి.
పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి అగ్ని ఫైర్ ఫైటర్కి సంబంధించిన ఒక పెద్ద పుస్తకం చదువుతుండగా జెన్నీ జిరాఫీ అతని తల్లి చూసారు.
అగ్నిని చూసి నవ్వి జెన్నీ తల్లి “ముందు ఎదుగు. తర్వాత ఈ సైజు పుస్తకాలు చదువుకో" అని చెప్పింది.
ఇవన్నీ అగ్నిని ప్రభావితం చేసాయి. కొన్నిసార్లు బాధపెట్టాయి. కానీ అతను తన కలను వదులుకోలేదు. తనను తాను నమ్ముకున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ ‘ఫైర్ ఫైటర్' గురించే ఆలోచించాడు.
అద్దంలో చూసుకుని తనకు తానే సెల్యూట్ చేసుకుని గర్వపడేవాడు.
ఇంతలో అతన్ని స్నేహితుడు హ్యారీ కోతి తన రెడ్ కారుతో వచ్చాడు. హారన్ కొట్టాడు. “వచ్చెయ్ ఆలస్యమవుతుంది” అన్నాడు.
“వస్తున్నా” జవాబు ఇచ్చాడు అగ్ని.
అగ్నిమాపక సిబ్బంది యూనిఫాంలో తయారైన అగ్ని వచ్చి హ్యారీ కారులో కూర్చున్నాడు. ఈవెంట్లో పిల్లలకు చూపించడానికి తన వద్ద హెల్మెట్, స్పెషల్ మాస్క్, బూట్లు, జాకెట్, గ్లోవ్స్, వాకీటాకీలు ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకున్నాడు.
హ్యారీ స్కూలువైపు దారి తీయగానే అగ్ని కాస్త భయపడ్డాడు.
“అందరూ నన్ను చూసి నవ్వితే?” అనుకున్నాడు.
అతనొక చిన్న ఎలుగుబంటు. కానీ ధైర్యశాలి.తన మనసును హ్యారీ చదివినట్లు అతనికి అనిపించింది.
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో