శ్రీ విఘ్నేశ్వర పూజా ద్రవ్యములు
పసుపు, కుంకుమ, వినాయక ప్రతిమ, అగరువత్తులు, హారతి కర్పూరం, అక్షతలు, బియ్యం, దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పంచపాత్ర, ఉద్ధరిణి, పళ్ళెం, గరిక, కొబ్బరికాయలు, నైవేద్య పదార్థములు, పత్రి, పాలవెల్లి.
నైవేద్యం
ఉండ్రాళ్లు-21, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి, ఆహార పదార్థాలు. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడంవలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్నీ, రాగి ప్రతిమ సంకల్ప సిద్ధిని, శిలా ప్రతిమ మోక్ష, జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
గణేశుని పూజ
(ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంవేసి, దానిమీద వినాయకుడి బొమ్మను ఉంచాలి. పైన పాలవెల్లి కట్టాలి. పసుపుతో వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్లు బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
దీపారాధన: ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.
శ్లో ॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ|
దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తస్తు ॥
పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణి (చెంచా)తో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య, ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ కింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాం తరశ్శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ గణేశాయ నమః
Diese Geschichte stammt aus der September 17, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 17, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.