నేడు మానవ జీవితం యాంత్రికంగా తయారైం ది. వారి వారి దినచర్యలో జై ప్రతిఒక్కరూ పరుగులు తీస్తున్నారు. ఖాళీ దొరికితే సెల్‌ఫోన్లు, టి.వీలకు అతుక్కుపోతు న్నారు. వీటికి దూరంగా ఇంటి నుండి మనసుకు నచ్చిన సుదూర పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడి స్థలాలు, నిర్మాణాలు, జల పొతాలు, సరస్సులు, నదులు, రమణీయ మైన ప్రకృతి, నగరాలు, వింతలు, విడ్డూరాలు, ఆయా ప్రాంతాల ఆచారాలు, ఆహార నియమాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకుంటే మనోల్లాసం కలుగుతుంది.
పర్యాటకం అంటే ఆంగ్లంలో టూరిజం అంటారు. ఇది లాటిన్ పదమైన టోరోనస్ నుండి ఆవిర్భవించింది. 16వ శతాబ్దంలో ఈ పదానికి అర్ధం చక్రంలాంటిది అని నిర్వచించారు. ఈ పదానికి నేడు ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ వారు జ్ఞానాన్వేషణ కోసం ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్లడం అని నిర్వచిస్తున్నారు. అనేకమంది పర్యాటకులు సందర్శిస్తే ఆ ప్రాంతంలో వ్యాపారం పెరుగుతుంది. చాలామందికి జీవనోపాధి లభిస్తుంది. గైడ్‌ల సహాయంతో అక్కడి చరిత్రను ప్రజలు తెలుసుకుంటారు. ఇలా ప్రజలు పర్యటన చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒకప్పుడు కేవలం సంపన్నవర్గాల వారు మాత్రమే ప్రపంచంలోని సుదూర ప్రాంతాలను పర్యటించేవారు. నేడు మధ్యతరగతి వారు కూడా ఆటవిడుపు కోసం తమకు అందుబాటులో ఉన్న పర్యాటక స్థలాలను సందర్శించి మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. ప్రసిద్ధ భవనాలు, గొప్ప కళాఖండాలు, కొత్త వ్యక్తులను కలవడం, కొత్త సంస్కృతులను అనుభవించడం, విభిన్న ఆహార రుచులను చూడటం, సముద్ర స్నానాలు చేయడం ఇత్యాది వాటి పట్ల ప్రజలకు మక్కువ పెరగడం వల్ల పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. విపరీతమైన జనం రావడం, రద్దీ పెరగడాన్ని మాస్ టూరిజం అంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిలకించడాన్ని టెంపుల్ టూరిజం అంటారు. తెలుగురాష్ట్రాలతో పాటు మనదేశంలో, ప్రపంచం వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆర్థిక స్థోమతను బట్టి ప్రజలు నచ్చిన ప్రదేశానికి వెళ్లి సేదతీరి కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చి తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమౌతుంటారు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సెలవులు వస్తాయి. ఆ కారణంగా వేసవిలో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటువంటి వారు సందర్శించడానికి అనువైన అనేక పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకుందాం.
Diese Geschichte stammt aus der March 31, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 31, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు