ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.ఎందుకంటే ఈరోజు మనం ప్రయాసపడుతూ సందర్శించే క్షేత్రాలు ఒకప్పుడు గొప్ప తీర్థ, పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కినవని గ్రంథాలు, శాసనాలు తెలుపుతాయి. గతంలో నేటి చిన్న చిన్న గ్రామాలు నిరతరం భక్తుల రాకపోకలతో సందడిగా, నిత్య పూజలతో, ఉత్సవాలతో శోభాయమానంగా ఉండేవని తెలుస్తుంది.
ఈ ఉపోద్ఘాతం వెనుక ఉన్న విషయం ఎందుకంటే మరుగున పడిపోయిన ఒక విశేష క్షేత్ర ప్రాధాన్యం తెలుపడానికి చేస్తున్న ప్రయత్నంలో దొరికిన హృదయాలను కలచివేసే సమాచారం.
దక్షిణ భారతదేశ ప్రత్యేకత
సువిశాలమైన మన దేశం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం.ముఖ్యంగా భాష, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, నిర్మాణ శైలి విషయంలో ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనపడతాయి.
దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్న రాష్ట్రాల మధ్య కూడా ఆది నుండి కూడా ఎన్నో భిన్న విభిన్న, సమాన జీవన శైలి కనపడుతుంది. ఇక ఆలయ నిర్మాణ శైలి తీసుకొంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనదైన ప్రత్యేక నిర్మాణ విశేషాలు కలిగి వుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ముఖ్యంగా కర్ణాటకలో కనిపించే ఆలయ నిర్మాణ శైలి అత్యంత క్లిష్టమైనది.ప్రత్యేకమైనది. ఇప్పుడు మనకు క్రీస్తుశకం నాలుగు/అయిదు శతాబ్దాల నిర్మాణాలు కనపడతాయి. వీటిలో కొన్ని గుహాలయాలు.
ఇవి ఎక్కువగా బాదామీ చాళుక్య రాజుల కాలంలో వారు పాలించిన బాదామీ, పట్టడక్కల్, ఐహోళేలలో కనపడతాయి. ఈ మూడు ప్రదేశాలలో గుహాలయాల నుండి విశేష రాతి కట్టడాల వరకు కనపడతాయి.
వీరి నుంచి విడిపోయిన కల్యాణి లేదా పశ్చిమ చాళుక్యులు, తూర్పు లేదా వేంగి చాళుక్యులు, రాష్ట్రకూటులూ, పశ్చిమ గంగ వంశం, శూణులు, కదంబ వంశం, హొయసులు పాలకులు ఈ ప్రత్యేక ఆలయ నిర్మాణ శైలిని మరింత మెరుగుపరిచారు. సుందరంగా, ఆకట్టుకొనే నిర్మాణాలను చేశారు. దక్షిణ భారతదేశంలోని మరే ప్రాంతంలోనూ కనిపించని విలక్షణ శైలి అని చెప్పాలి.
Diese Geschichte stammt aus der November 17, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 17, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు