బాకీ ఎలుగుబంటి చంపకవనంలో కుండలు ఇతయారుచేసేవాడు. కుమ్మరి చక్రంపై పాత్రలు తయారు చేసి పొయ్యి మీద కాల్చేవాడు. మంటల్లో కాల్చిన మట్టి పాత్రలు మార్కెట్లో అమ్మేవాడు.
ఒకసారి బ్లాకీ పెద్ద కుండ తయారుచేసాడు. అది చాలా మందంగా, బరువుగా ఉంది. ఇతర మట్టి పాత్రలతో దానిని ఒక గదిలో పెట్టాడు. గదిలో పెట్టిన ఇతర మట్టి పాత్రలు ఈ మందపాటి కుండను ఆశ్చర్యంగా చూసాయి. అతని సైజు కారణంగా అవి మొదట్లో భయపడ్డాయి. కానీ క్రమంగా అతని స్నేహితులయ్యాయి.
ఒక రోజు పాత్రలన్నీ కలిసి అతనికి 'పప్పీ' అని పేరు పెట్టాయి. తనకు కొత్త పేరు వచ్చినందుకు పప్పీ చాలా సంతోషించాడు.
ఆ రోజు రాత్రి అందరు కలిసి పార్టీ చేసుకున్నారు. బ్లాకీ గదికి తాళం వేయగానే పాత్రలన్నీ సంబరాలు చేసుకున్నాయి. చిన్న మట్టి మూత “ఓయి... ఓయి... ఆహ్... ఆహ్..." అంటూ డ్యాన్స్ చేసింది. సన్నటి మెడ ఉన్న కుండ వినసొంపుగా పాట పాడింది.
వెడెల్పాంటి కుండ డ్యాన్స్ చేసింది. కూజా పవరుల్ డిస్కో డ్యాన్స్ చేసింది. తనను ఎవరూ అడగకపోయినా పప్పీ కూడా బెల్‌బాటమ్ వేసుకున్న లిటిల్ చార్లీ చాప్లిన్ డ్యాన్స్ చేసాడు.
మర్నాడు బ్లాకీ పప్పీ తప్ప మిగతా కుండలన్నీ అమ్మడానికి మార్కెట్‌కి తీసుకువెళ్లాడు.
పప్పీ ఒంటరిగా మిగిలిపోయినందుకు విచారంలో మునిగిపోయాడు. మిగతా పాత్రలతో తాను అమ్ముడు పోవడానికి మార్కెట్‌కి వెళ్లాలనుకున్నాడు. కానీ బ్లాకీ వేరే ఉద్దేశ్యం కోసం పప్పీని తయారుచేసాడు.
కొన్ని రోజుల తర్వాత పప్పీ గదిలోకి మరిన్ని కొత్త పాత్రలు వచ్చాయి. కానీ వాటిని కూడా అమ్మడానికి మార్కెట్‌కి తీసుకువెళ్లారు. కొత్త పాత్రలు వస్తూనే ఉన్నాయి. అమ్మడానికి వాటిని మార్కెట్‌కి తీసుకు వెళ్తూనే ఉన్నారు. కానీ పెద్ద, లావుపాటి కుండ ఇంకా అక్కడే ఉండిపోయింది. నెమ్మదిగా దానిపై దుమ్ము పేరుకోసాగింది. కొత్త పాత్రలు వచ్చి అతన్ని ఆట పట్టించాయి. “హే పప్పీ, మేమూ అమ్మకానికి మార్కెట్ వెళ్తాం. నిన్ను మరొక డస్ట్ లేయర్ కప్పేస్తుంది" అన్నాయి.
పప్పీ ఎవరి మాటలు పట్టించుకోలేదు. తన పెద్ద పొట్ట చెక్కలయ్యేలా “హె... హె...” అని నవ్వాడు.
"పిల్లలూ, చూడండి ఒక రోజు నేను ఇక్కడి నుంచి బయటపడతాను, ఎంతో సరదాగా. హెూళీ రాబోతోంది. అప్పుడు చాలా కుండలు అమ్ముతారు.
వాటిలో ఎన్నో రంగులు కలుపుతారు హెూ... హె....
హెూ...” అన్నాడు.
Esta historia es de la edición March 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అందమైన రంగులు నింపండి
సెప్టెంబర్ 6 'జాతీయ పుస్తక పఠన దినోత్సవం'.
డమరూ - పెట్రోల్ పంప్ లో
డమరూ - పెట్రోల్ పంప్ లో
ఉపాధ్యాయులను కనుగొనండి
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ మాన్సూన్ క్యాంప్‌కి చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు.
వర్షంలో సహాయం
చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.
నిధి అన్వేషణ
బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.
దారి చూపండి
మొక్కజొన్న చేనులో సిరి ఉడుత వీలైనన్ని ఎక్కువ కంకులను సేక రించాలి. ఈ పద్మవ్యూహం ఛేదించి ఆమె ఎన్ని సేకరిస్తుందో చెప్పండి.
మన - వాటి తేడా
బంబుల్బీ గబ్బిలం ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. ఇది నాణెం అంత బరువు ఉంటుంది.
తేడాలు గుర్తించండి
ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం.
మరోవైపు
ఆగస్టు 13 ‘అంతర్జాతీయ లెఫ్ట్ హాండర్స్ డే'.
బిట్టర్ మ్యాజిక్
బిట్టర్ మ్యాజిక్