
“హలో, వినండి త్వరగా నాకు మరో దుప్పటి ఇవ్వండి. ఈ రోజు చలి గడ్డ కట్టుకుపోతోంది" మీకూ ఎలుక తన రూమేట్ చీకూ కుందేలుతో చెప్పాడు.
“మనం నిద్ర లేచే సమయం అయింది. లేవండి.
ఇవ్వాళ ఏం రోజో మీరు మర్చిపోయారా” అడిగాడు చీకూ.
“అయ్యో ఈ చలిలో ఎవరు బయటికి పోవాలనుకుంటారు? నాకు ఇంకో దుప్పటి ఇచ్చి, తినడానికి కొన్ని బిస్కెట్లు కూడా ఇవ్వండి" మీకూ గొణుగుతూ దుప్పటిని మరింత నిండుగా కప్పుకున్నాడు.
పడుకుని బిస్కెట్లు తినడం మొదలు పెట్టాడు మీకూ. ఇంకేముంది, బిస్కెట్ల తీపి వాసన చీమలకు అందడంతో బెడ్ రూమ్లోకి అవి వరుస కట్టాయి. చీమలు కుడుతుండటంతో చిరాకు పడ్డ మీకూకి లేవడం తప్ప మరో మార్గం లేకపోయింది.
“సరి సరే, చెప్పు నేను ఏం మరిచిపోయాను?” లేచి కూర్చొని అడిగాడు మీకూ.
“మన శీతాకాలపు సాహసయాత్ర ఈ రోజు ప్రారంభ మవుతుంది! మన స్కూల్లోని విద్యార్థులందరూ సిమ్లా పర్యటనకు వెళ్తున్నారని గుర్తుందా? త్వరగా రెడీ అవ్వు. గంటలో బస్సు బయలుదేరుతుంది" అన్నాడు చీకూ ఉత్సాహంగా.
“ఓహ్, నేను దాని గురించి మరిచిపోలేదు. నేను వెళ్లకూడదని అనుకున్నాను. ఈ చలిలో మనల్ని సిమ్లా వరకు తీసుకువెళ్లడానికి బోర్డింగ్ స్కూల్ మేనేజ్మెంట్ కు ఏమి వచ్చింది?" అన్నాడు మీకూ.
“నిజంగా ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండ బోతున్నావా? సరదాగా ఉంటుంది! తినడానికి లభించే వివిధ పదార్థాల గురించి ఆలోచించు" చీకూ పట్టు బట్టాడు. దాంతో మాల్ రోడ్లో రుచికరమైన ఆహార పదార్థాలు తింటున్నట్లు ఊహించుకుని మీకూ చివరకు ఒప్పుకున్నాడు.
విద్యార్థులందరూ తమ సాహసయాత్రకు సిమ్లా వెళ్లడానికి తయారు అవడం ప్రారంభించారు. వెచ్చగా ఉండే కోట్లు, జాకెట్లు ధరించి ఉత్సాహంగా స్కూల్ బస్సు ఎక్కారు.
పిల్లలు సరదాగా నవ్వుతూ బస్సులో అంత్యాక్షరి ఆడుకుంటూ సిమ్లా చేరుకున్నారు. వారు దిగుతుండగా చంపకవనంలో కంటే అక్కడ చాలా చలిగా ఉందని మీకూ వెంటనే గమనించాడు. కానీ ఇతర పిల్లలు చలితో పెద్దగా బాధపడినట్లు కనిపించలేదు.
నిజానికి, వారికి థ్రిల్గా ఉన్నది.
“ఇప్పటికి మీరందరూ అల్పాహారం చేసారు కదా.
మనం అందరం మాల్ రోడ్లో షికారు చేయడానికి ఒక చోటుకు వెళ్తున్నాం.
ఆ తర్వాత మనం కుఫ్రీకి వెళ్తాము. అక్కడ మీరు స్కేయింగ్ చేయవచ్చు. చాలా సరదాగా ఉంటుంది!” గ్రూప్ లీడర్ అయిన బ్లాకీ ఎలుగుబంటి ప్రకటించాడు.
Esta historia es de la edición January 2025 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 2025 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

మారిన దృక్పథం
మారిన దృక్పథం

స్మార్ట్
పేపర్ వింటర్

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

చిన్నారి కలంతో
చిన్నారి కలంతో

మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా