1457 నుంచి 1459 మధ్యన ఈ ప్రపంచ పటాన్ని గీసినట్టుగా భావిస్తున్నారు.
ఫ్రా మౌరో గురించిన విషయాలు పెద్దగా తెలియవు. ఆయన సాధువుగా మారకముందు ప్రపంచమంతా తిరిగారని నమ్ముతారు. కానీ ఆయన మ్యాప్లు గీయడానికి ప్రయాణాలు చేయలేదు. వెనిస్ నగరం అప్పట్లో నావికాశక్తిగా ఉండేది. అనేక సంస్కృతుల సమావేశాలకు వేదికగా ఉండేది. దీనివల్ల ప్రామౌరోకు తత్త్వవేత్తలు, భౌగోళిక విజ్ఞానం కలిగినవారు, మ్యాప్లను గీసేవారు, ముస్లింలు, ఇథోపియన్ ప్రతినిధులతో కూడిన నావికుల నుంచి సమాచారాన్ని సేకరించగలిగారు. ఆయన వద్ద పెద్ద సంఖ్యలో పుస్తకాలు, మ్యాప్లు ఉండేవి. ఫలితంగా ఆ సమయంలో లభించిన భౌగోళిక సమాచారం ఆధారంగా ఈ మ్యాప్ ను రూపొందించారు. దీనిని 3వేలకు పైగా వ్యాఖ్యానాలతో తీర్చిదిద్దారు. వాటిల్లో కొన్ని ప్రాంతాల ఆచారాలు, భౌగోళిక వివరాలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ప్రాంతాల చిత్రీకరణలో తాను ఎలాంటి స్వేచ్ఛ తీసుకున్నదీ కూడా వివరించే ప్రయత్నం చేశారు.
ఆయనో సన్యాసి. ఆయనేమీ ప్రపంచాన్ని చుట్టి రాలేదు. ఇందులో ప్రత్యేకత ఏముందునే అనుమానం కలగక మానదు. ఆ సన్యాసే ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఆ మ్యాప్ మధ్యయుగానికి చెందిన ఒక అద్భుతంగా గుర్తింపు పొందింది. మామూలుగా అన్నిమ్యాప్లలో ఉత్తర దిక్కు పైన ఉంటుంది. వెనిస్ లో 15వ శతాబ్దంలో రూపొందిన ఈ మ్యాప్లో దక్షిణ దిక్కువైపు ఉంది. ఈ మ్యాప్ రూపొందించిన వ్యక్తి భూగోళమంతా ఏమీ తిరగలేదు. తాను నివసించే మఠం నుంచి కాలు బయట పెట్టకుండానే ఈ పని చేశారు.
నాసా ఉపగ్రహాలు ఆక్వా, టెర్రా తీసిన కాంపోజిట్ చిత్రంతో ఫ్రా మౌరో ప్రపంచ పటం పోలిక)
ఈ మ్యాప్ వెనిస్ మ్యూజియంలో నేటికీ దర్శనమిస్తోంది. నీలం, బంగారు వర్ణంలో వృత్తాకారంలో రెండు మీటర్ల వ్యాసార్థం ఉన్న ఎండిన చర్మంపై గీసిన ఈ మ్యాప్ ఓ చెక్కకు బిగించారు. ఈ మ్యాప్ సృష్టికర్త పేరు ఫ్రా మౌరో. ఆయన 15వ శతాబ్దం మధ్యలో రూపొందించిన ఈ పటం మన విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలియజేస్తుంది. అలాగే ఖండాలు, సముద్రాల గురించిన వ్యాఖ్యానాలు, చిత్రాలు కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. పోర్చుగల్ రాజు అల్ఫాన్సో ఆదేశాలతో 1459లో రూపొందిన ఈ మ్యాప్ పురాణాలు, మూఢనమ్మకాలను దాటి పరిశీలనాత్మక దృక్పథంతో చిత్రీకరించినదిగా భావిస్తున్నారు.
తలకిందులుగా...
Esta historia es de la edición April 07, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 07, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
12.1.2025 నుంచి 18.1.2025 వరకు
ఈడ్పుగంటి పద్మజారాణి
కేరళలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం మార్కో
గత కొద్దిరోజులుగా మలయాళ సినిమా మార్కో గురించి తెలుగు సినిమా సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా రివ్యూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు.
విటమిన్ బి12 లోపిస్తే చాలా డేంజర్
మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ బి12 ముఖ్యమైనది.
అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్టు, క్రేజీ కాక్ రేర్ మరియు దువా
ఈ లగ్జరీ సింగిల్ మాల్టు భారతదేశంలోని అతిపెద్ద మెచ్యూరేషన్ వేర్హౌస్ లో తయారయ్యాయి మరియు సౌత్ సీస్ డిస్టిలరీస్ ద్వారా భారతదేశంలోని అతిపెద్ద రాగి పాట్ స్టిలో డిస్టిల్డ్ చేయబడ్డాయి.
జీవిత పాఠాలు నేర్పే గాలిపటాలు
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి.
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
అరుగు బడి
రాజు అరుగు బడి లో రెండేళ్లు చదువుకుని కాన్వెంట్ బడిలో మూడవ తరగతి లో చేరాడు.
ఈవారం కథ
పెద్ద పండుగ
సూర్య-find the differences
సూర్య-find the differences