
విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. సాత్వికమైన ఆరాధనలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. కనుక సత్వగుణ ప్రధానుడైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థన లకు పూజలకు అనువైన మాసం అని అర్ధం.సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయమే ధనుస్సంక్రమణ. ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అని అంటారు. ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణంగా పరిగణిస్తారు.అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే ఇది రాత్రికాలం, మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం.
ఇక్కడి నుండి ఉత్తరాయణం. అంటే పగలుగా భావిస్తారు. ఇలా అనుకున్నప్పుడు దక్షిణాయమునకు, చివర, ఉత్తరాయణమునకు ముందుండేదీ ధనుర్మాసం. ఈ మాసం ప్రాతఃకాలమునకు ఎంతటి పవిత్రతను కలిగి ఉంటే, అలాంటి పవిత్రతను పొందుపరచుకున్న మాసం. దేవాలయాలలో ఆగమశాస్త్రం, కైంకర్యాలలో, డాక్టర్ స్థానిక ఆచార సంప్రదాయాలలో, ఇతర సంప్రదాయాలలో కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి తిరుప్పావై పఠనం, సేవ, అండాళూజ, గోదాదేవి కళ్యాణం మొదలైనవన్నీ ద్రావిడదేశ సంప్రదాయాలుగా పెద్దలు చెప్తుంటారు. ధనుర్మాసకాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేయడం విశేషం. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు, నివేదనలు చేసి ఆ ప్రసాదాలను పిల్లలకు పంచుతారు. అలా పంచడాన్ని బాలభాగం అంటారు.సూర్యుడు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించేవరకు అనగా, భోగివరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ధనుర్మాసం ఉభయసంధ్యలలో ఇంటిని శుభ్రం చేసి, దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, దారిద్య్రం తొలగిపోయి అషైశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకం కూడా. అలాగే ఈ ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీముహూర్తం లాంటిదనే అభిప్రాయం కూడా పెద్దల ద్వారా తెలుస్తుంది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత, పూజలు చేయడం ఎంతో పుణ్యం అని కూడా ప్రతీతి. ఈనెలరోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి మార్గశిరం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణున్ని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీస్నానాలు,
Esta historia es de la edición December 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

ఈ వారం కార్ట్యున్స్
ఈ వారం కార్ట్యున్స్

అద్భుతమైన జలపాతాలు
ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.

ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు
వారఫలం

ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్

పోషకాల పండు.. స్ట్రాబెర్రీ
తరప్రదేశ్లోని మోహనాల్గంజ్ పరిధిలోని గోపాలఖేడా గ్రామం. ఈ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సింగ్ ఎంబిఏ చేశాడు.

హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

రంగులు వేయండి
రంగులు వేయండి

||ఔదార్యం||
అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పాలన చేస్తూ ఉండేవాడు, అతని మంత్రి పేరు సుబుద్ధి.
సందేశాన్నిచ్చే కథలు
సందేశాన్నిచ్చే కథలు

మహిళాభివృద్ధి మానవాభివృద్ధి
మహిళలు ఆకాశంలో సగం దేశ జనాభాలో సగభాగమున్న మహిళలు పురుషులు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది.