అలాంబ్రా
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ముస్లింలు, క్రైస్తవులు, జాయిష్ గ్రెనడా రాజ్యంలో సోదర భావంతో జీవించారు. గ్రెనడా నగరానికి అభిముఖంగా చేరువలో సియర్రా పర్వత సానువుల్లో సబికా కొండపై మూర్ పాలకుల చివరి కలగా అలాంబ్రా పేరుతో పటిష్టమైన కోట నేటికీ నెలకొని ఉంది. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన అత్యంత ప్రసిద్ధ స్మారక నిర్మాణం. స్పానిష్ పునరుజ్జీవనోద్యమానికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక విశేషాలను కలిగివుండి, ఇస్లామిక్ ప్రపంచంలో అద్భుతమైన కోటగా ప్రశంసలు అందుకుంటోంది. స్పెయిన్లోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి.
1984 నుండి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరి యునెస్కోవారి గుర్తింపు పొందింది. మన దేశంలోని తాజ్మహల్ను కులమతాలకతీతంగా అందరూ ఎలా ఇష్టపడతారో అదే విధంగా అలాంబ్రా సాంస్కృతిక భవంతిని ప్రపంచ ప్రజలు ఇష్టపడతారు. ఈ నిర్మాణ సముదాయాన్ని 11వ శతాబ్దం నుండి ఎందరో తీర్చిదిద్దారు.మహమ్మద్ ఇబ్న్ అల్-అహ్మర్, ఇబ్న్ నగ్రిల్లా, నస్రిద్ రాజవంశ పాలకులు, 14వ శతాబ్ది పాలకులైన యూసుఫ్, మహమ్మద్ ఇత్యాది వారెందరో పలు మార్పులు చేసి ఈ సాంస్కృతిక భవంతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఈ ప్రాంతంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు ఆకర్షణీయమైన అద్భుతలు కోటలు ఉన్నాయి. ఎక్కువ భాగం కోటలు అలాంబ్రాకు ఉత్తర అంచున ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పటి మూరిష్ తెగకు చెందిన నాస్రిడ్ రాజుల నివాస భవంతులుగా ఉండేవి.
అలాంబ్రా రాజ నగరంగా సిల్లింది.మెక్సు వార్, కోమరేస్ ప్యాలెస్, ప్యాలెస్ ఆఫ్ ది లయన్స్, పార్టల్ ప్యాలెస్ ఇవి నేడు సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ఉన్నాయి. అల్కాజాబా కోట అలాంబ్రాకు పశ్చిమ కొన వద్ద ఉంది.ఆ కాలంలో ఇది రక్షణ వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండేది. కొన్ని శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన మూరిష్ నిర్మాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఇవి నిలిచి ఉన్నాయి.
Esta historia es de la edición February 18, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 18, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.