జ్ఞాన సాగరాన్నిమధించి, సౌకర్యవంతమైన ప్రపంచాన్ని మానవాళికి కానుకగా అందించాయి. ఆలోచనలు ఆచరణ రూపం ధరిస్తే, ప్రపంచం ఎంతగా మార్పు సంతరించుకుంటుందో ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని చూస్తే అవగతమవుతుంది. బట్టగట్టడం చేతగాని రోజుల నుండి భూగోళ, ఖగోళ రహస్యాలను చేధించే స్థాయికి చేరిన మానవ జీవన సుదీర్ఘ ప్రస్థానంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు ప్రపంచాన్ని నూతనంగా ఆవిష్కరించి, ఆశ్చర్యపరిచాయి.
ఎప్పుడో చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న కథలు, కల్పితాలు వాస్తవ రూపం సంతరించుకున్నాయి. పచ్చి మాంసం తినే రోజుల నుండి పంచభక్ష్య పరమాన్నాలు పరిస్థితులు కల్పించుకున్నాం. నడక పయనం నుండి ఆకాశపథంలో విహరించే పరిజ్ఞానం పెంపొందిచుకున్నాం. రవాణా సౌకర్యాల్లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. పాదరక్షలు లేకుండా నడిచే స్థాయి 3 నుండి పాదాలకు మట్టి అంటకుండా పయనించే వినూత్నమైన ప్రయాణ సాధనాలను సమకూర్చుకున్నాం. మనిషిలోని ఆసక్తికి ప్రతీక 'ప్రశ్న' ప్రశ్నించే తత్వం మన ఆలోచనలు అర్థవంతమైన రూపాన్ని సంతరించుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. మనలోని జ్ఞాన తృష్ణకు పరిపూర్ణత చేకూర్చుతుంది. తనకేమీ తెలియదు అనుకున్నప్పుడే జ్ఞానం వైపు దృష్టి పెట్టవచ్చు. అన్నీ తెలుసునని, విర్రవీగడం అహం ప్రదర్శించడం అజ్ఞానమని గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ చెప్పిన మాట సర్వకాల సర్వావస్థలకు అన్వయించవచ్చు. ఈ ప్రపంచం తర్కం మీదనే నడిచింది.
తత్వం మీదనే మనుగడ సాగిస్తున్నది. ప్రపంచంలోని ప్రముఖ తత్వవేత్తలు శాస్త్రబద్ధమైన పునాదులతో ప్రపంచ మానవ గమనాన్ని మార్చడానికి కృషి చేసిన మాట సత్యదూరం కాదు.మన ఆలోచనా పరిధి విస్తరించకపోతే నేడు మనం వీక్షిస్తున్నప్రపంచం కేవలం కథల్లోనే సాధ్యమయ్యేది. సైన్స్ ఫిక్సన్ పరిధులకే పరిమితమయ్యేది. మన ఆసక్తి, పరిశీలనా పఠిమ క్రియాశీలకంగా పరివర్తన చెందకపోతే ఈ అనంతమైన విశ్వంలో మానవుడు కూడా ఇతర జీవరాశుల్లా కేవలం ఆహారం కోసం మాత్రమే నిరంతరం శ్రమించి, జీవించి, మరణించేవాడు. అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఆలోచించి, జీవించడమే మానవ జాతిని నేడు సర్వసృష్టిలో సమున్నది శిఖరాలను అధిరోహించేలా చేసింది.
Esta historia es de la edición March 10, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 10, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు