- మన రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన గుహలు లేదా బిలాలలో ప్రథమస్థానంలో ఉన్నవి బొర్రాగుహలు. తరువాత ఆ స్థాయిలో కాకున్నా స్థానిక ఆకర్షణ పొందుతున్నవి నంద్యాల జిల్లాలోని బెలూం గుహలు. వీటికి భిన్నంగా ఉండే గుహలు కూడా ఉన్నాయి. అవే పల్నాడు జిల్లాలోని గుత్తికొండ గ్రామ సమీపంలోని గుహలు.
క్షేత్రగాథ ప్రకారం గుత్తికొండ బిలం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం. అనేకమంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. గత శతాబ్దంలో ఎందరో మహనీయులు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.
క్షేత్రగాథ
పురాణాలలో చూసినట్లయితే మహర్షులు తపోభూములు ఎక్కువగా నదీతీరాలలో అంటే నీటివసతి ఉన్న కొండగుహలలో, దట్టమైన వనాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది.జలం జీవం కదా! వివిధ ప్రాంతాలలో కనిపించే ఆలయాలు వారు తమ నిత్యపూజల నిమిత్తం ఏర్పాటు చేసుకొన్నవి అని కూడా అర్థం చేసుకోవచ్చు. తొలి గుహాలయాలు పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. గుత్తికొండ బిలం పురాణ ప్రాముఖ్యం తెలుసుకోవాలంటే భాగవంతంలోని కొన్ని గుత్తికొండ క్షేత్రగాథ ప్రధానంగా ముచికుందుడు అనే మహారాజుతో ముడిపడి ఉన్నది. ఎవరీ ముచికుందుడు?
ముచికుందుడు
భాగవత పురాణంలో ఈయన ప్రస్థావన ఉన్నది. సూర్యవంశానికి చెందిన మాంధాత మహారాజు పుత్రుడు. అనేక పురాణాలలో పేర్కొన అంబరీష మహర్షి ఈయన సోదరుడు. గొప్పయోధుడు. సామ్రాజాన్ని నలుదిశలా విస్తరింపచేసాడు.ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన చేసేవారు. ఆయన కీర్తి, ధైర్యసాహసాలు దేవలోకాన్ని చేరుకొన్నాయి. ఆ సమయంలో అసురులతో పోరాడుతున్న అమరులు ఓటమి అంచున ఉన్నారు.దేవేంద్రుడు శ్రీమహావిష్ణువు సలహా మేరకు దూతలను ముచికుందుని వద్దకు పంపి యుద్ధంలో సహాయం చేయమని అర్థించారు. వారి కోరికను మన్నించి దేవదానవ యుద్ధంలో పాల్గొన్నారు.ముచికుందుడు. ఎన్నో సంవత్స రాలు గడిచిపోయాయి. దేవతలను విజయం వరించింది. ఆదిదంపతుల కుమారుడైన |శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ముచికుందుడు శ్రీమహావిష్ణువును సందర్శించుకున్నారు.ఆయనను భూలోకానికి వెళ్లడానికి అనుమతి కోరారు. శ్రీహరి ఇప్పుడు భూలోకంలో ద్వాపరయుగం నడుస్తోంది.
Esta historia es de la edición August 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).