లింగరాజు శ్రీపరమశివుడు ప్రపంచవ్యాప్తంగా అనేక క్షేత్రాలలో కొలువు తీరి పూజలు అందుకొంటున్నారు. ఆ దివ్యప్రదేశాలలో కొన్నింట మహేశ్వరుడు స్వయంభూగాను, మరి కొన్నింటిలో శ్రీమహావిష్ణువు, విధాత బ్రహ్మదేవుడు, ఇతర దేవీదేవతలు, దిక్పాలకులు, గ్రహాధిపతులు ప్రతిష్టించినవి. మిగిలినవి మహర్షులు కొలిచినవి కావడం గమనించవలసిన విషయం.స్వయంభూక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మ ప్రతిష్ఠిత లింగాన్ని, శ్రీమహావిష్ణు ప్రతిష్టించిన లింగాన్ని, అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు ప్రతిష్టించిన లింగాలను ఒకే క్షేత్రంలో సందర్శించుకోవచ్చును. స్మరణ మాత్రమున ప్రసాదించే తిరువణ్ణామలై (అరుణాచలం). ఇక మహర్షులలో సప్తఋషులు, ఇతర మహర్షులు వేలాదిగా లింగాలను దేశ నలుమూలలా ప్రతిష్టించారు.ముఖ్యంగా శ్రీగౌతమమహర్షి దక్షిణభారతదేశంలో వందలాది పవిత్ర ప్రదేశాలలో నిత్యపూజ నిమిత్తం మహేశ్వరలింగాలను ఏర్పాటు చేసుకొన్నారు. అందుకే దక్షిణభారతదేశంలో అత్యధిక క్షేత్రాలలో స్వామిని శ్రీ అగస్తేశ్వరుడు అని పిలుస్తారు. లోకసంరక్షణార్థం అనేక అవతారాలు ధరించిన శ్రీమహావిష్ణువు తన రామావతార సందర్భంగా అనేక శివలింగాలను వివిధ ప్రాంతాలలో ప్రతిష్టించారు.కారణం అసురుడైనా, లోకకంట కుడైనా, ఎన్నో అకృత్యాలు చేసినా, జన్మతః బ్రాహ్మణుడైన రావణబ్రహ్మను సంహరించడం వలన సంక్రమించిన బ్రహ్మహత్యాదోషం తొలగించుకోవడానికి. అలా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టించిన లింగాలు మనదేశంలోనే కాదు పొరుగుదేశాలలో కూడా నెలకొని ఉండటం విశేషం. తొలిలింగాన్ని భారతదేశంలో రామేశ్వరంలో ప్రతిష్టించిన అవతార పురుషుడు తనమార్గంలో ఎదురైనా పావన ప్రదేశాలలో లింగాలను ప్రతిష్టించారు అని క్షేత్రగాధలు తెలుపుతున్నాయి. అలాంటి ఒక విశేషలింగం పవిత్ర కృష్ణవేణి నదీతీరంలో ఇంద్రకీలాద్రి మీద అమ్మలగన్న అమ్మ చాలా పెద్దమ్మ శ్రీ కనకదుర్గదేవి శ్రీమల్లేశ్వరస్వామితో కొలువైన విజయవాడ నగరానికి సమీపంలోని ముస్తాబాద అనే గ్రామంలో ఉన్నది.
Esta historia es de la edición September 22, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 22, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.