ప్రతిష్టాత్మకమైన 'పద్మభూషణ్’ పురస్కారానికి సామాజిక ఏడాది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సేవావిభాగంలో వ్యవస్థాపకురాలు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుధామూర్తి గారిని ఎంపిక చేయటం విశేషం. ఆ మానవతామూర్తికి 'పద్మభూషణ్' ప్రకటించగానే ఆత్మీయులు, కుటుంబసభ్యులు మంగళహారతి ఇస్తూ, ఆశీర్వచనాలు పలికే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. ఆమె స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా, వక్తగా జగమెరిగిన మగువ.
ఒకసారి సుధామూర్తిగారు ఓ కళాశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైతన్యవంతమైన ఆమె ప్రసంగం తరువాత ప్రశ్నోత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆ మాననిని ఓ అభిమాని “మేడమ్! ఓ వ్యక్తి విజయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, జీవితభాగస్వామి సహకారం ఎంతవరకు అవసరం?" అని ప్రశ్నించారు. అప్పుడు సుధామూర్తిగారు తన సహజమైన నిర్మల మందహాసంతో "సన్నిహితుల సహకారం లేకపోతే ఎవరూ ముందుకు వెళ్ళలేరు. అర్థం చేసుకొని ప్రోత్సహించే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే సులువుగా మన స్వప్నాల్ని సాకారం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మా విషయమే తీసుకోండి! నారాయణమూర్తి గారి జీవితకాల కల ఇన్ఫోసిస్! ముప్పై ఏళ్ళ పాటు తపస్సులా ఆ సాఫ్ట్వేర్ సంస్థ కోసం శ్రమించారు. వ్యక్తిగత జీవితాన్ని, సౌకర్యాల్ని కూడా పట్టించుకోలేదు. ఇన్ఫోసిస్ ప్రారంభ దశలో దాదాపు నెలలో ఇరవై రోజులు ప్రయాణాలే చేస్తుండేవారు. మిత్రురాలిగా, జీవితభాగస్వామిగా ఆయన దీక్షను, పట్టుదలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాదే కదా! మా అదృష్టవశాత్తూ మా వైపు వారు, వాళ్ళ వైపు వారు కూడా మాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఇన్ఫోసిస్ ను ప్రారంభించిన తొలిరోజుల్లో మేమిద్దరం ఎక్కువ సమయం కార్యాలయంలోనే గడిపేవాళ్ళం. మా పిల్లల్ని మా సోదరీమణులు, మా అత్తగారే చూసుకున్నారు. ఇక నేను ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కార్యకలాపాల్లో భాగంగా నెలల తరబడి వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి వస్తుంది. సేవాకార్యక్రమాల్లో భాగంగా రేయనకా, పగలనకా ఇల్లు వదిలి బయట ఉండాల్సి వస్తుంది. అయినా ఒక్కరోజు కూడా నారాయణమూర్తి భర్తగా నాపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. పైగా నేను సేవారంగంలో ముందుకు వెళ్ళేందుకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించారు, ఇప్పటికీ సహకరిస్తున్నారు” అని వివరించారు.
Esta historia es de la edición April 2023 de Sri Ramakrishna Prabha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Sri Ramakrishna Prabha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద