భారతీయ సనాతన సంస్కృతి పునరుద్ధరణలో ఆచార్య శంకరుల పాత్ర అనన్యసామాన్యం, తలనరహితం. అడుగంటిపోతున్న సనాతన శైథిల్యాలను వెలికితీసి, మెరుగులుదిద్ది మహాసౌధాన్నే నిర్మించిన నిర్మాణకర్త ఆయన! ధార్మికంగా స్థానభ్రంశమై, విచ్ఛిన్నమవుతున్న భారతీయ సంస్కృతిని తన నిగూఢ కార్యప్రణాళిక ద్వారా నిశ్శబ్దంగా సమైక్యం చేసిన ఆధ్యాత్మిక విప్లవవీరులు ఆదిశంకరులు.దేశవ్యాప్తంగా ఆయన చేసిన పర్యటనలు, నాలుగు దిక్కులా ఆయన ఏర్పాటు చేసిన మఠాలు ఈ సనాతన పుణ్యభూమి యొక్క సాంస్కృతిక ఏకత్వాన్ని సుస్పష్టం చేశాయి. ఆయన ప్రారంభించిన సన్న్యాస సంప్రదాయాలు మన సంస్కృతిని శాశ్వత ఆదర్శంపై పునఃప్రతిష్ఠించాయి.నేటికీ జాతిని పునరుజ్జీవింపజేస్తూనే ఉన్నాయి.
ఆచార్య శంకరులు చేసిన రచనల ద్వారా వేదోక్తధర్మం వినూత్న ఒరవడిలో, నవనవోన్మేషంతో జిజ్ఞాసువులకు, పామరులకు పండితులకు, అందుబాటులోనికి వచ్చింది. ఆధ్యాత్మిక దిశాదర్శనం చేసింది. ఆయన చేసిన రచనలను మూడు స్తరాలుగా విభజించవచ్చు. ప్రస్థానత్రయ గ్రంథాలపై రాసిన 'భాష్యగ్రంథాలు' మొదటిస్తరానికి చెందినవి. ఇవి విద్వాంసులకొరకు ఉద్దేశించబడినవి. వేదాంతాన్ని సరళంగా వివరించే 'ప్రకరణగ్రంథాలు' రెండవస్తరానికి చెందినవి. ఈ గ్రంథాలు వేదాంతాన్ని విభిన్నకోణాల నుండి పాఠకులకు పరిచయం చేస్తాయి. ఇవి పాండిత్యం లేని జిజ్ఞాసువులకు మార్గదర్శనం చేయగలిగే సరళ గ్రంథాలు. ఇక మూడవస్తరానికి చెందినవి దేవీదేవతలపై, ఆధ్యాత్మికతత్త్వాలపై ఆయన రచించిన స్తోత్రాలు.ఇవి సామాన్య ప్రజానీకం కోసం. ఈ విధంగా శంకరులవారు వైదికధర్మాన్ని అన్ని స్థాయులవారికీ అందుబాటులోకి తీసుకొనిరావడానికి తన అనన్యసామాన్య శైలిలో, సులలిత సంస్కృతభాషలో రచనలు చేశారు.
శంకరులవారి స్తోత్రసాహిత్యంలో అత్యంత ప్రముఖమైన స్తోత్రరాజం 'శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం'. ఈ స్తోత్రానికి గల ప్రత్యేకతలను గమనిద్దాం.
1. ఇది స్తోత్రమైనప్పటికీ వేదాంత తత్త్వాన్ని పూర్తిగా పరిచయం చేయగల 'ప్రకరణ గ్రంథం' యొక్క లక్షణాలను కలిగివున్నది. స్తోత్రరూపంలో ఉన్న ప్రకరణ గ్రంథంగా దీనిని చెప్పుకోవచ్చు.
Esta historia es de la edición May 2024 de Sri Ramakrishna Prabha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2024 de Sri Ramakrishna Prabha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద