టవల్ హైజీన్ తప్పనిసరి
Grihshobha - Telugu|March 2024
టవల్ శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.
- పారూల్ భట్నాగర్
టవల్ హైజీన్ తప్పనిసరి

మనం ప్రతి రోజూ స్నానం చేసాక టవల్తో ఒళ్లంతా తుడుచుకుంటాం. శరీరం నుంచి దుర్వాసన రాకుండా సబ్బు రాసుకుని స్నానం చేస్తాం.దాంతో శరీరం నుంచి దుర్వాసన రాకుండా. శుభ్రంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మీ టవల్పై శ్రద్ధ పెట్టారా? మీరు చివరగా ఎప్పుడు ఉతికారు? ఒక వారం క్రితమా? లేదా పదిహేను రోజుల క్రితమా?

మీరు రోజు శరీర శుభ్రతపై శ్రద్ధ -వహిస్తున్నామని అనుకుంటారు. కానీ స్నానం చేయడం ఎంత ముఖ్యమో మీ టవల్ను సైతం శుభ్రంగా ఉతుక్కోవడం అంతే ముఖ్యమని మీరు -తెలుసుకోవాలి. అది ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

టవల్ శుభ్రంగా ఉంచుకోవడమెలా?

టవల్ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు రోజూ స్నానం చేసిన తర్వాత ఉపయోగించే టవల్ను పూర్తిగా ఎండలో ఆరబెట్టాలి. అందులో మన కంటికి కనపడని సూక్ష్మమైన బ్యాక్టీరియా క్రిములుంటాయి. టవల్ తేమగా ఉంటే ఆ బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. అందువల్ల దానిని ఎండలో ఆరబెట్టాలి. దాంతో చాలావరకు ఇన్ఫెక్షన్ సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే దానర్థం మీరు టవల్ని ఉతికే అవసరం లేదని కాదు.

ప్రతి 2-3 రోజులకు ఒకసారైనా టవల్ను ఉతకాలి

అది బాత్ టవల్ అయినా, ఫేస్ టవల్ అయినా సరే లేదా హ్యాండ్ టవల్ అయినా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పొడి టవల్తో స్నానం చేసిన తర్వాత తుడుచుకుంటే లేదా తలంటి స్నానం చేసాక తడిసిన వెంట్రుకలను తుడుచుకుంటే అది తడిగా మారుతుంది. అంతేకాకుండా మన శరీరం నుంచి లేదా చర్మం నుంచి వచ్చే చెమటను గ్రహిస్తుంది. కాబట్టి మీరు చర్మ రోగాల బారిన పడటం తప్పదు.

ఎలా ఉతకాలి? :

బాత్ టవల్ను సరిగ్గా ఉతకాలి. నీటిలో డిటర్జెంట్ పౌడర్లతోపాటు కొద్దిగా వెనిగర్ కలపాలి. దాంతో బ్యాక్టీరియాలన్నీ సులభంగా నశిస్తాయి. తడి కారణంగా వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. మీరు బేకింగ్ సోడాతో ఉతకవచ్చు. తర్వాత ఎండలో ఆరబెట్టాలి. అప్పుడు తేమ పూర్తిగా తొలగిపోతుంది.

Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 minutos  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 minutos  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 minutos  |
November 2024