ఉత్కర్ష్ సెలవులు గడపడానికి తన తాతయ్య ఊరికి వెళ్లాడు. అతనికి ఆ ఊరు ఎంతగానో నచ్చింది.అక్కడ విద్యుత్ సౌకర్యం లేనప్పటికీ, అంతా ప్రకృతి అందాలతో నిండి ఉంది. అక్కడ చుట్టూరా అందమైన కొండలు, పచ్చదనం, పచ్చని పొలాలు ఆవరించి ఉన్నాయి. అతడు ఇవన్నీ ఇష్టపడ్డాడు. అతనికి నీలి ఆకాశం కింద నిద్రపోవాలన్న కోరిక ఉంది.కానీ గ్రామంలో పరిస్థితి అంతా మారిపోయింది.గ్రామ ప్రజలు భయపడిపోసాగారు. సంధ్యా సమయానికి ముందే వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేవారు. ఎవ్వరూ కూడా ఇప్పుడు తమ డాబాలపై పడుకోవడం లేదు. ఇళ్లకు తాళాలు వేసి చాలామంది గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోయారు.
ఉత్కర్ష్ బయటకు వెళ్లకుండా వాళ్ల తాతయ్య అడ్డుకున్నాడు. ఇది ఉత్కర్ని అయోమయంలో పడేసింది. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు.
ఒక రోజు అతడు నిజంగా గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. దాని గురించి వాళ్ల తాతయ్యను అడగాలనుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు “తాతయ్యా, ఊర్లో ఏం జరిగింది. ఊర్లోని వారంతా ఎందుకు అంత విచారంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా సాయంకాలం తర్వాత బయట కనిపించరు. అందమైన ఆకాశం కింద తమ డాబా మీద పడుకోరు" అని అడిగాడు.
ఈ మార్పు ఉత్కరిని బాధ పెడుతోందని తాతయ్యకు తెలుసు.“బాబూ, ఊళ్లోని బ్లాక్ వ్యాలీ మా సమస్యకు ప్రధాన మూలంగా మారింది” అని చెప్పాడు.
ఉత్కర్ష్ తన కుర్చీని తాతయ్య దగ్గరికి లాక్కొన్నాడు. “కానీ ప్రతి ఒక్కరూ బ్లాక్ వ్యాలీని ఇష్టపడతారు.ఇది అందంగానూ ఉంటుంది.ఎలా అది సమస్యకి కారణమైంది?” అని అడిగాడు.
తాతయ్య నిట్టూర్చాడు. “ఏమి జరిగిందో మాకు తెలియదు. కానీ ఒక రోజు రాత్రి ఏదో లేక ఎవరో బ్లాక్వ్యాలీలో నివసించడానికి వచ్చారు. కొందరు దాన్ని దెయ్యం అంటారు. ఇంకొకరు ఒక ఆత్మ అని అంటారు. కానీ అదేమిటో ఎవ్వరికీ తెలియదు” అని చెప్పాడు.
“మీరు దాన్ని చూసారా?” అని అడిగాడు ఉత్కర్ష్.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్