మేఘు, రిచా తమకు సమీపంలో ఉన్న పార్క్ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్నారు.
“నీకు తెలుసా, మా నాన్న ఫారిన్ విజిట్‌కి వెళ్లినప్పుడు నాకు క్యాండీస్ తెచ్చారు. నీతో పంచుకోవాలని నేను వాటిని తీసుకొచ్చాను” రిచా చెప్పింది.
మేఘ సంతోషపడిపోతూ “ఓహ్... ధన్యవాదాలు.నేను వాటిని ఇష్టపడతాను" అంది. రిచా తన జాకెట్ జేబులో నుంచి చిన్నవి, రంగు రంగుల స్థూపాకారపు క్యాండీలు ఉన్న ఒక చిన్న డబ్బా తీసింది.
“చూస్తుంటే అవి మందు గోళీల్లా ఉన్నాయి" అంది మేఘ ఆమెను చూస్తూ.
"అవి మందు గోళీలు కావు. చాక్లెట్‌తో నిండి ఉన్నాయి. నోట్లో సులభంగా కరిగిపోతాయి. ఒకటి ప్రయత్నించి చూడు” చెప్పింది రిచా డబ్బాను తన స్నేహితురాలికి ఇస్తూ. ఆ సమయంలో రిచా పెంపుడు కుక్క ఒక పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఎగిరి ఆమె ఒడిలో నుంచి దూసుకువెళ్లింది. ఈ గందరగోళంలో రిచా చేతిలోని క్యాండీల డబ్బా ఎగిరి సమీపంలో ఉన్న పొదల్లో పడింది.
“ఓహ్, నా క్యాండీలు!” అరిచింది రిచా.
డబ్బా వెతకడానికి మేఘ పొదలవైపు పరుగెత్తింది.
“క్యాండీలు దొరికాయా” అడిగింది రిచా.
“డబ్బా ఖాళీగా నేల మీద పడి ఉంది. క్యాండీలు ఇక మనం తినడానికి పనికిరావేమో” చెప్పింది మేఘ విచారంగా.
ఇద్దరూ పొదల్లో వెతికారు.
"హే చూడు, ఆ ఆకు మీద రెండు పడ్డాయి. అవి మురికిగా లేవు. కాబట్టి మనం తినవచ్చు” సంతోషంగా చెప్పింది రిచా. మేఘ రెండు నారింజ రంగు క్యాండీలు చూసింది. చుట్టుపక్కల వెతికారు.కానీ మిగతా వాటి ఆచూకీ ఎక్కడ కనిపించలేదు.
“వీటిని తినేద్దాం” అంది మేఘ. స్నేహితులిద్దరూ క్యాండీస్ నోట్లో పెట్టుకుని చప్పరించారు. “రుచి చాలా బాగుంది. కానీ నువ్వు చెప్పిన చాక్లెట్ ఫ్లేవర్ ఇందులో లేదు" నములుతూ చెప్పింది మేఘ.
“దీని రుచి కూడా భిన్నంగా ఉంది” అంది రిచా. ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఇద్దరు అమ్మాయిలు తాము చిన్నగా మరింత చిన్నగా మారడం గమనించి ఆశ్చర్యపోయారు.
"ఏం జరుగుతోంది?” అరిచింది మేఘ.
“మనం తప్పుడు క్యాండీలు తిన్నామనిపిస్తోంది.చిన్న ఎర్ర చీమలుగా మారిపోయాము" అంది రిచా.
“ఇప్పుడు ఏం చేయాలి?” అడగింది మేఘ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా