అసలైన న్యాయం
Champak - Telugu|June 2023
వేసు సవి సెలవుల్లో చీకూ కుందేలు ఇంట్లో "ఒంటరితనంతో బాధపడుతున్నాడు
కథ కుముద్ కుమార్
అసలైన న్యాయం

వేసు సవి సెలవుల్లో చీకూ కుందేలు ఇంట్లో "ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అతని స్నేహితులు తల్లిదండ్రులతో కలిసి పర్వతాలు ఇతర ప్రదేశాలు చూడడానికి వెళ్లారు. కానీ ఈసారి చీకూ వాళ్ల నాన్న ఎక్కువ పని ఉండడంతో అతన్ని బయటకు తీసుకువెళ్ల లేకపోయాడు.

స్నేహితులు లేకపోవడంతో చీకూకు చాలా బాధగా ఉంది.

అతని విచారం చూసి వాళ్లమ్మ “చీకూ, నువ్వు, నేను అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లొచ్చు కదా?” అని అడిగింది.

సంతోషంతో ఎగిరి గంతేసాడు చీకూ.ఢిల్లీలో చాలా విసుగు చెందిన చీకూ ఎంతో కాలంగా ఆ గ్రామాన్ని సందర్శించాలి.అనుకున్నాడు.

మరుసటి రోజు వాళ్లు బస్సు ఎక్కి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని జంతువులు నదిలో సరదాగా గడపడం, బయట కబడ్డీ, కుస్తీ, దాగుడుమూతలు లాంటి ఆటలు ఆడటం చీకూ చూసాడు.

త్వరలోనే అతను జంపీ కోతి, సెల్లీ ఉడుత, గిగీ జిరాఫీ, బ్లాకీ ఎలుగుబంటి, కామీ ఆవుదూడలతో స్నేహం ఏర్పరుచుకున్నాడు.వాళ్లందరితో సరదాగా గడిపాడు. ఢిల్లీలో అతనికి కొద్దిమంది స్నేహితులే ఉన్నారు.వాళ్లు చాలా దూరంలో నివసించేవారు. కానీ ఇక్కడ ఊర్లో మాత్రం అతనికి అందరు తన స్నేహితులనిపించింది.

ఒక రోజు అంతా కలిసి ఒక ప్రత్యేకమైన ఆట ఆడాలనుకున్నారు. దానికి 'కోర్ట్ రూమ్' అని పేరు పెట్టారు. జంపీకి కుర్చీ ఏర్పాటుచేసారు.దానికి ముందు ఒక టేబుల్ వేసారు. టేబుల్పై చెక్కతో చేసిన సుత్తి పెట్టారు. కుర్చీ వెనుక నల్ల గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకుని ఉన్న న్యాయ దేవత చిత్రాన్ని చెట్టుకి వేలాడదీసారు. జంపీ కుర్చీలో కూర్చోగానే న్యాయమూర్తిగా మారిపోయాడు. జంతువుల వివాదాలను పరిష్కరించసాగాడు.

ఈ ఆటను ఆస్వాదించిన చీకూ తాను కూడా జడ్జి కావాలనుకున్నాడు.

అతని ఉత్సాహం చూసి జంపీ “చీకూ కొత్తవాడు కాబట్టి ఇప్పుడతన్ని జడ్జీగా నియమిద్దాం. మనమంతా అతని ముందు కేసులు వినిపిద్దాం. వివాదాలను ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం" అన్నాడు.

చీకూ చాలా సంతోషించాడు. జడ్జిగా మారగానే సుత్తితో టేబుల్పై కొట్టాడు. జంతువులు నిశ్శబ్దంగా మారిపోయాయి. సుత్తి శబ్దం చీకూకి నచ్చింది.

కొద్దిసేపటికి సెల్లీ వృద్ధురాలి వేషంలో కర్ర సహాయంతో చీకూ కోర్టులోకి ప్రవేశించాడు.తర్వాత ఏమవుతుందోనని జంతువులన్నీ రహస్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాయి.

“తర్వాతి వాది అప్రోచ్ కావచ్చు” గట్టిగా అరిచి చెప్పాడు బ్లాకీ.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView all
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025