సైన్స్ పీరియడ్లో మోహిత్ సార్ ఎంతో చక్కగా శాస్త్రీయ ఆవిష్కరణల గురించి చెబుతున్నారు.
ఒక అధ్యాయం పూర్తి చేసాక విద్యార్థులను “మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు?” అని అడిగారు.
ముందుగా షాహిద్ చేయి పైకెత్తాడు.
“సార్, నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్నలిద్దరూ డాక్టర్లు. పెద్దయ్యాక నేనూ వారిలాగే ఇతరులకు సేవ చేయాలనుకుంటున్నాను”.
“వెరీ గుడ్”.
“సార్, నేను మీలాగ సైన్స్ టీచర్ కావాలనుకుంటున్నాను. అందరికీ మంచి విద్య నందిస్తాను” అన్నాడు రవి.
“సార్, నేను పెద్దయ్యాక సినిమా హీరో అవ్వాలను కుంటున్నాను. నాకు హీరోలంటే చాలా ఇష్టం" చెప్పాడు శౌర్య. “సార్, నేను డ్యాన్సర్ కావాలనుకుంటున్నాను” చెప్పింది నియా.
"నాకు ఆర్టిస్టు కావాలని ఉంది" అంది మయూరి.
విపుల్ అందరి మాటలు శ్రద్ధగా వింటున్నాడు.
పిల్లలందరూ ఒక్కొక్కరుగా తమ కోరికను వ్యక్తం చేసారు.
“విపుల్, ఎందుకు మౌనంగా కూర్చున్నావు? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావో చెప్పు" అని అడిగాడు మోహిత్ సార్.
అతడు లేచి నిశ్శబ్దంగా తన స్థానంలో నిలబడ్డాడు.
“భయపడకు. కంఫర్టబుల్గా ఉండు. నువ్వు కూడా ఏదో కావాలని కోరుకుని ఉంటావు" అన్నాడు మోహిత్ సార్.
“సా...ర్... నేను... పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ కావాలనుకుంటున్నాను" తడబడుతూ చెప్పాడు విపుల్.
అతని కోరిక విని పిల్లలందరూ గట్టిగా నవ్వసాగారు.
“అతడు ఆస్ట్రోనాట్ గనక అయితే శాటిలైట్ ఎగరక ముందే కింద పడిపోతుంది" అన్నాడు శౌర్య.
“ఆస్ట్రోనాట్లు చేసే ప్రతి పనిలో చురుకుదనం ఉండాలి. అతడు సరిగ్గా మాట్లాడలేడు. ఇక ఎలా పనిచేస్తాడు?" అడిగాడు షాహిద్.
“మీరందరూ పెద్దయ్యాక ఏదో ఒకటి కావాలని కోరుకున్నారు. అలాగే విపుల్ కూడా ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్నాడు. మీరు అతన్ని ఎగతాళి చేయకూడదు”.
“సార్, నేను చెప్పేది నిజమే. అతడు ఏదైనా చెప్పడానికి చాలా సమయం తీసుకుంటాడు.
మాట్లాడుతున్నప్పుడు బాగా తడబడతాడు. ఒక్క వాక్యం మాట్లాడడానికి ఎన్నోసార్లు ఆగిపోతాడు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్