సరి కొత్త ప్రారంభం
Champak - Telugu|January 2024
పన్నేండేళ్ల ఆర్యన్ తన ప్రియమైన నానమ్మ, తాతయ్య, స్నేహితుల కోసం దీన్నొక ప్రత్యేకమైన రోజుగా మార్చాలనుకున్నాడు.
కథ • కుసుమ్ అగర్వాల్
సరి కొత్త ప్రారంభం

కొత్త సంవత్సరం మొదటి రోజు దగ్గర పడింది. పన్నేండేళ్ల ఆర్యన్ తన ప్రియమైన నానమ్మ, తాతయ్య, స్నేహితుల కోసం దీన్నొక ప్రత్యేకమైన రోజుగా మార్చాలనుకున్నాడు.

ఆర్యన్ నానమ్మ, తాతయ్యల నుంచి పాతకాలం నాటి కథలు వింటూ ఎదిగాడు. పాఠ్య పుస్తకాల నుంచి నేర్చుకోలేనివి కథల నుంచి చాలా తెలుసుకున్నాడు. నానమ్మ, తాతయ్యల దగ్గర అంతులేని అనుభవాల నిధి ఉందని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ వారితోనే ఉంటూ సంతోషంగా గడిపేవాడు. ఈ సంవత్సరం వారితో కలిసి పిక్నిక్కి వెళ్లాలనుకున్నాడు.

“నానమ్మ, తాతయ్యా, నేను 2024 నూతన సంవత్సరం మొదటి రోజును మీతో, మీ స్నేహితులతో జరుపుకోవాలనుకుంటున్నాను. నా స్నేహితులు నేను కలిసి పార్క్లో పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాము. మీరు, మీ స్నేహితులు మాతో చేరినట్లయితే మేమెంతో సంతోషిస్తాం" చెప్పాడు ఆర్యన్.

వారు సరేనని చెప్పడంతో పిల్లలు స్పెషల్ పిక్నిక్ కోసం సిద్ధం కాసాగారు. కలర్ఫుల్ ఇన్విటేషన్ కార్డు తయారుచేసి పరిసరాల్లోని పెద్ద వారికి పంచి పెట్టారు. తల్లిదండ్రుల సహాయంతో క్యారెట్ శాండ్విచ్లు, నారింజ పండ్లు, వేరుశనగలు, ఇంట్లో చేసిన స్నాక్స్ నింపి పిక్నిక్ బుట్టలను సిద్ధం చేసారు. ఒక పెద్ద కుండలో నిమ్మరసం తయారుచేయడంలో ఆర్యన్ తల్లి వారికి సహాయపడింది.

పిక్నిక్ రోజు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆర్యన్ నానమ్మ, తాతయ్యలు తమ స్నేహితులను తీసుకుని పారికి రాగానే అంతా నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకోసాగారు. వృద్ధ అతిథులు హాయిగా కూర్చోడానికి వీలుగా పిల్లలు ఒక ప్రదేశాన్ని రూపొందించి, వారు విశ్రాంతి తీసుకోడానికి పరుపులు, కుషన్లు ఏర్పాటు చేసారు. పార్కులో ‘2024 నూతన సంవత్సరానికి సుస్వాగతం' పోస్టర్లు పెట్టారు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView all
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025