ఆనంద్ సొసైటీలో అందరు ఎంతో ఉత్సాహంగా బిజీగా ఉన్నారు. ఎటు చూసినా మకర సంక్రాంతి, లోహ్రీ పండుగ, గాలిపటాల పోటీల కర పత్రాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది “ఎత్తుగా ఎగిరే గాలిపటం" పోటీని నిర్వహిస్తుంటారు.
కానీ ఈసారి “డిస్ప్లే కైట్” షో కేటగిరీ కొత్తగా వచ్చి చేరింది.
“రాత్రికి రైడ్స్, మ్యూజిక్, డ్యాన్స్, బోన్ ఫైర్లు, రుచికరమైన నువ్వులు, పప్డ్ రైస్ స్వీట్స్, స్నాక్స్ ఉంటాయి” సంతోషంగా చెప్పాడు రామన్.
“పల్లీలు వేయించడం సరదాగా ఉంటుంది.
పాప్కార్న్ కూడా" అన్నాడు పీటర్.
“డిస్ప్లే కైట్ షో అంటే ఏమిటి?”.
"అత్యంత ఆకర్షణీయంగా కనిపించే గాలిపటం గెలుస్తుందని ఇది చెబుతోంది" ఇంటి గడప ముందు కనిపించిన కరపత్రాన్ని జాగ్రత్తగా చూస్తూ చెప్పాడు రామన్. “ఉదాహరణకు డ్రాగన్ కైట్ లేదా లాంగ్ టెయిల్ కైట్. నువ్వు ఆ గాలిపటాన్ని ఆకాశంలో ప్రదర్శించాలి. ఫ్యాన్షీయెస్ట్ కైట్ ఇందులో గెలుస్తుంది”.
“ఇది సరదాగా ఉంది" ఎగిరి గంతేసాడు పీటర్.ఈ ఫ్యానీ కాంపిటీషన్లో పాల్గొనాలనుకున్నాడు.
రామన్ సైతం సాధారణ గాలిపటాల పోటీతోపాటు ఫ్యాన్సీ కైట్ కాంపిటీషన్లో పాల్గొనాలనుకున్నాడు. గాలి పటాలు ఎగురవేయడంలో అతడు ప్రావీణ్యుడు. ఇతరుల గాలిపటాలను తెంపడంలో నేర్పరి. గత సంవత్సరం అందరి గాలిపటాలను తెంపి విజయం సాధించాడు.అతని గాలిపటం మిగతా వాటికంటే చాలా ఎత్తులో ఎగిరింది. రామన్, పీటర్లు గాలిపటాలు కొనడానికి మోహన్ గాలిపటాల దుకాణానికి వెళ్లారు కానీ అక్కడ చాలా రద్దీగా ఉంది. అందరూ ఎగబడి గాలిపటాలను కొంటున్నారు.
రామన్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.“సాధారణ గాలిపటాలన్నీ అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం పీటర్” అన్నాడు.
పీటర్ పక్కనే ఉన్న షాపులో ఫ్యాన్సీ కైట్లను చూసాడు. అందులో ఒక పెద్ద డ్రాగన్ కైట్ ఉంది.మరొక రంగు రంగుల బటర్ ఫ్లై కైట్ పొడవాటి రిబ్బన్ టెయిల్తో కనిపించింది. అలాగే అక్కడ ఒక పెద్ద ఆక్టోపస్ కైట్ ఉంది. పీటర్ దాన్ని కొనాలనుకున్నాడు.
“నువ్వు దాన్ని కనీసం పట్టుకోలేవు. చాలా పెద్దగా ఉంది. పోటీకి అర్హత పొందాలంటే నీ గాలిపటం ఆకాశంలో ఎగరాలి" అన్నాడు రామన్.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా