బుజ్జీ దోమ సాయంత్రం తాను దాక్కున్న ప్రదేశం నుంచి బయటకు వచ్చింది. పగలంతా ఆకలితో గడిపింది. దాన్ని తీర్చుకోడానికి ఇప్పుడు రక్తం కావాలి. మనిషి కోసం వెతకసాగింది.ఒక ఇంట్లోకి ప్రవేశించాక ఆమెకు ఒక కుర్చీపై కూర్చున్న వృద్ధ అంకుల్ జీవన్ కనిపించాడు.అతని కుడి కాలు మామూలుగా ఉంది. కానీ రెండవ దానిపై పలుచని గుడ్డ చుట్టి ఉంది.బహుశా దోమల నుంచి రక్షించుకోడానికి అలా చేసాడేమో. బుజ్జీ అటు ఇటు చూసింది. అక్కడ ఎవరూ లేరని గమనించింది. అంకుల్ జీవన్ చైర్లో నిద్రలో జోగుతున్నట్లు కనిపించాడు.
ఇంత మంచి అవకాశం లభించినందుకు బుజ్జీకి ఎంతో థ్రిల్‌గా ఉంది. ఆకలి తీర్చుకోడానికి వెంటనే జీవన్ అంకుల్ దగ్గరికి చేరుకుంది.పలుచని వస్త్రం నుంచి అతన్ని కుట్టడానికి ప్రయత్నించినప్పుడు బుజ్జీ తుండం చర్మంలోకి చొచ్చుకుని వెళ్లలేకపోయింది. చేతులతో తుడిచి మరో ప్రయత్నం చేసింది. కానీ నిరాశే ఎదురైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవన్ కాలును కుట్టలేకపోయింది. అయోమయంలో పడింది. ఏం తప్పు జరిగిందో అర్థం కాలేదు.ఇంతకుముందు మనుషులను వారి బట్టల నుంచి ఎన్నోసార్లు కుట్టి విజయం సాధించింది.
ఇలా జరగడంతో తన వైఫల్యానికి వృద్ధాప్యమే కారణమని భావించిన బుజ్జీ నిరాశతో తిరిగి తన రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది. ఇంతలో షార్పీ దోమ ఆహారం వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.
“ఎందుకంత తొందరగా తిరిగి వచ్చావు బుజ్జీ" అడిగింది షార్పీ.
"నేను దాన్ని వివరించలేను. ఈ రోజు నమ్మలేని సంఘటన ఒకటి జరిగింది. అది వింటే నువ్వు షాక్ తింటావు. నాకు వృద్ధాప్యం వచ్చిందేమో షార్పీ, ఏదీ నా స్వాధీనంలో ఉండటం లేదు” నిరాశగా బదులిచ్చింది బుజ్జీ.
“ఎందుకలా అంటావు? నువ్వింకా యవ్వనంగానే ఉన్నావు. దేన్నైనా సాధ్యం చేయగలవు”.
బుజ్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ షార్పీకి జరిగినదంతా వివరించింది. ఈ కథ విని షార్పీ విచారం వ్యక్తం చేసింది.
"ధైర్యంగా ఉండు బుజ్జీ, నువ్వు ఇంత తొందరగా నమ్మకం కోల్పోతే మన కుటుంబం ఏం కావాలి?”
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్