దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu|November 2024
దీపావళి పోస్టర్ పోటీ కథ
• కుముద్ కుమార్
దీపావళి పోస్టర్ పోటీ

"హే జంపీ, హరిత వనం రాజు దీపావళి రోజున "పిల్లలకు ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాడని తెలిసింది" చీకూ కుందేలు జంపీ కోతితో చెప్పాడు.

అప్పుడు లంబూ జిరాఫీ “అరే, నందన్ అడవి రాజు దీపావళి రోజున పిల్లలకు ఆటల పోటీని కూడా నిర్వహిస్తున్నాడట" అన్నాడు.

అప్పుడే మోటు ఏనుగు తొండం పైకెత్తి “అయ్యో.... అంతేకాదు మిత్రులారా... చందనపు (గంధం) అడవి రాజు తన వద్ద పిల్లలకు 'గిఫ్ట్ ప్యాకింగ్'ల పోటీని నిర్వహిస్తున్నాడట" అంటూ చెప్పాడు.

అప్పుడు గిల్లో ఉడుత "మిత్రులారా, దీపావళి రోజున మిగతా అడవుల్లో రాజులు, తమ పిల్లలకు పోటీలను నిర్వహిస్తున్నారు. కానీ మన చంపకవనం రాజు షేర్ సింగ్ మాత్రం దీపావళికి పిల్లలకు ఏమీ ఏర్పాటు చేయటం లేదు. అతనో పెద్ద పిసినారి" అంది.

“అరే, దీపావళి రోజున తన రాజమహల్ని జిగేల్ జిగేల్ మనే లైట్లతో అలంకరిస్తున్నాడు కదా? దీపావళి రోజున అది ఎలా మెరుస్తుందో చూడలేదా?” అన్నాడు బ్లాకీ ఎలుగుబంటి.

చంపకవనంలోని పిల్లలందరూ తమ రాజు షేర్సింగ్పై కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇతర రాజుల మాదిరిగా దీపావళి నాడు పిలలలకు అతను ఎలాంటి పోటీలను నిర్వహించటం లేదు.

అప్పుడు ఈ పిల్లలందరూ కలిసి షేర్ సింగ్కు తమ నిరసన తెలపాలని ఒక పథకం వేసారు. అయితే ఆ చిన్నారుల అసంతృప్తి విషయం షేర్సింగ్కు తెలిసింది.

దీంతో చిన్నారుల కోపాన్ని తొలగించేందుకు షేర్ సింగ్ కూడా ఓ పథకం వేసాడు. అప్పుడు షేర్ సింగ్ తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడంతోపాటు పిల్లల నిరసన కార్యక్రమం అడ్డుకోవడానికి తన రాజరికపు దుస్తులను కాకుండా,

ఎర్రటి కుర్తా, తెల్లని పైజామా ధరించి సాధారణ అరణ్యవాసిగా మారాడు.

ఎవరికీ షేర్ సింగ్ తెలియకుండా తన రాజభవనం లోని రహస్య సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చాడు.

అతను నేరుగా ప్లే గ్రౌండ్కి వెళ్లాడు. అక్కడ పిల్లలు తమ నిరసన కార్యక్రమం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

అతను దగ్గరలోని పొదల్లో దాక్కున్నాడు. పిల్లల మాటలు వింటూ వాళ్లు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు.

అప్పుడు మోటూ “ప్రియమైన మిత్రులారా, షేర్సింగ్ దిష్టిబొమ్మ తయారైపోయి సిద్ధంగా ఉంది" అన్నాడు.

"ఏయ్ మోటూ, ఆ సింహం దిష్టిబొమ్మ తోకను ఇంకొంచెం పొడవుగా చేయ్. సింహాలకు తోక, మీసాలే వాటికి అసలైన గుర్తింపు. అవి చాలాసేపు కాలుతూ ఉండాలి" చీకూ మాటలతో పిల్లలంతా ఘోల్లుమంటూ నవ్వారు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView all
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024