రామాయణంలో రావణాసురుడు ప్రతినాయకుడిగా అందరికీ సుపరిచితమే.ఇతను పది తలలు కలిగి ఉంటాడు.రాముడు లేని సమయంలో దొంగచాటుగా సీతాదేవిని ఎత్తుకొనిపోయిన కారణంగా రావణుడికి చెడ్డపేరు వచ్చింది. అటువంటి రావణుని దేవునిగా కొలిచే ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. శ్రీరాముడు రావణాసురుని చంపి విజయం సాధించాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దసరా పండుగ సందర్భంగా రావణుని బొమ్మలను ఏర్పాటు చేసి తగలబెడుతుంటారు. అయితే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణాసురుడికి గుడి కట్టి పూజిస్తున్నారు. మహాయోధుడు, శివభక్తుడైన రావణాసురుని నాయకుడిగా వీరంతా భావించి పూజిస్తుంటారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ వంటి అనేక ప్రదేశాలలో అతి పెద్ద రావణుని బొమ్మలను ఏర్పాటు చేసి తగలబెడుతుంటారు. ఇటువంటి చర్యలను సైతం రావణుని భక్తులు వ్యతిరేకిస్తుంటారు. లంకాధిపతియైన రావణుని తమ నాయకునిగా పూజించే ఆలయాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి.
రావణ దేవాలయం, బిస్రఖ్, నోయిడా
బంగారు లంక రావణాసురుడి జన్మస్థలమని అనేక మంది విశ్వసిస్తారు.జానపద కథల ప్రకారం ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా సమీపంలో గౌతమ బుద్ధ నగర్ చేరువలో ఉన్న బిస్రఖ్ గ్రామం రావణుడి జన్మస్థలం అని ఈ ప్రాంతవాసులు విశ్వసిస్తారు. ఇది చాలా పురాతన పట్టణం. బిఖ్ పౌరాణిక రాక్షస రాజు రావణుని పూజించే రావణ మందిర్ ఉంది. ఢిల్లీ నుండి ఈ ఆలయం ముప్పై కి.మీ.దూరంలో ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రావణ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ పది తలల రావణాసురుని విగ్రహం ఉంది.రావణునికి పది తలలు ఉండేలా ఇక్కడే మహాశివుడి నుండి వరదానం పొందినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.