ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన వన్యప్రాణులు, క్రూరమృగాలను చూడటానికి ప్రతిరోజూ పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. వాటిలో కొన్ని:
ఎతోషా నేషనల్ పార్క్
ఎతోషా వాయువ్య నమీబియాలో కునేనే ప్రాంతంలో ఒక జాతీయ ఉద్యానవనం. ఆఫ్రికాలోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఇది ఉత్తర నమీబియా, ఒవాంటోలాండ్లకు ప్రవేశ ద్వారంగా చెబుతుంటారు. ఎతోషా అంటే గొప్ప తెల్లని ప్రాంతం అని అర్థం. ఇక్కడ భారీగా ఉప్పు పాన్ లు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో మొక్కలు తక్కువగా పెరుగుతాయి. ఆఫ్రికాలోనే ఇది అతి పెద్ద ఉప్పు పాన్. ఇక్కడి ఉప్పునీటిలో రొయ్యలు అధికంగా కనిపిస్తాయి. నమీబియాకు ఉత్తరాన ఉన్న కువెలై-ఎతోషా బేసిన్లో ఇది భాగం. వర్షాకాలంలో ఇది నీటితో నిండిపోయి ఒక సరస్సులా కనిపిస్తుంది.నీరు అధికంగా ఉన్నప్పుడు పెలికాన్ పక్షులు కూడా వస్తాయి. వేసవిలో నీరు ఆవిరై ఉప్పునిల్వలు బయటపడి ఈ ప్రాంతమంతా శ్వేత వర్ణ ఉపరితలంతో కనిపిస్తుంది. ఇక్కడి ఉప్పు పాన్ 130 కి.మీ. పొడవు, 50 కి.మీ. వెడల్పు ఉంటుంది. నమీబియాలోనే అత్యధికంగా వన్యప్రాణులు నివసించే అభయారణ్యంగా పేరొందింది.విపరీతంగా పెరిగే గడ్డి కొన్ని వన్య ప్రాణులకు మేతగా ఉపయోగపడుతోంది.పలు రకాల జంతువులకు ఇది నిలయం.సింహాలు, ఏనుగులు, చిరుతలు, హైనాలు, జీబ్రాలు, సింగ్బాక్, ఈలాండ్ ఇత్యాది అనేక జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇది ఒక సరస్సు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని 190756 స్థాపించారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.