'ఉద్బోధన్' రామకృష్ణ మఠ చరిత్రలో ఒదిగిపోయిన అమూల్య, అనర్ఘ రత్నం! అనేక అపూర్వ సంఘటనలకు ఆలవాలం! ఐతిహాసిక, చారిత్రక, ఉజ్జ్వల ఆధ్యాత్మిక రసోద్వేగ హేలకు యవనిక! ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనిపించని ఒక బ్రహ్మజ్ఞాని అరుదైన దివ్య సంకల్పంతో రూపుదిద్దుకొన్న 'చింతామణి గృహం!' రామకృష్ణ సంఘజనని, మాతృదేవి అయిన శారదామాత కలకత్తాకు వచ్చినప్పుడు అక్కడా ఇక్కడా భక్తుల ఇళ్ళలోనో, బాడుగ ఇంటిలోనో ఉండటం చూడలేని స్వామి శారదానంద ఆ దివ్యజనని కోసం అప్పు చేసి నిర్మించిన అపురూప మాతృసదనం 'ఉద్బోధన్'. 1909 మే 23న శారదమ్మ ఈ ఇంటిలో కాలుమోపి గృహప్రవేశం చేశారు. ఈ రోజును 'పదార్పణ దివస్'గా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో గొప్ప పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఇంటిని భక్తులు మాయేర్ బాడి (మాతృదేవి ఇల్లు) అని ప్రేమగా పిలుచుకొంటారు.
మహాశక్తి, జగదధీశ్వరి నివాసం : "జగజ్జననిని కేంద్రంగా చేసుకొని దైవకుటుంబంలోని దేవతలందరూ ఒకచోట చేరినట్లుండేది ఉద్బోధన్ గృహం. అమ్మ అపారకృప మూలంగా ప్రతిఒక్కరూ ఈశ్వర భావంలో నిమగ్నమై ఉండేవారు. ఒక పవిత్రమైన దివ్యానందపు వాతావరణంలో కాలం గడిచిపోయేది. అమ్మ సఖీగణం, సంతానం ఆ దివ్యానందంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు” అంటూ ఎంతో అద్భుతంగా 'ఉద్బోధన్'లోని వాతావరణాన్ని వర్ణిస్తారు శ్రీశారదామఠం ద్వితీయ అధ్యక్షురాలు ప్రవ్రాజిక మోక్షప్రాణ. అమ్మ ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకొని మంత్రదీక్ష కోసం వచ్చే భక్తులు; కష్టాలలో, కన్నీళ్ళలో అమ్మ సాన్నిధ్యంలో దొరికే మనశ్శాంతి, ఓదార్పు, సాంత్వన, అలౌకిక దివ్యానందం కోసం వచ్చే ప్రజలు; వైరాగ్యభావనతో సన్న్యాసదీక్ష కోసం వచ్చే అమ్మ నేతృత్వంలోని సంఘ బ్రహ్మచారులు... ఇలా వివిధ వర్గాల వారితో 'ఉద్బోధన్' గొప్ప దివ్యాకర్షణ కేంద్రంగా విరాజిల్లింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద