మగాళ్లు తరచుగా తమ కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ఆకర్షితు లవుతుంటారు. అసలు దీని వెనుక ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకోవటం ఆసక్తికరమే.
1981లో వచ్చిన 'ప్రేమ్‌గీత్' హిందీ చిత్రంలో 'న ఉమ్ కీ సీమా హెూ... న జర్మ్ కా బంధన్..' అంటూ పుట్టుక రీతి, వయోపరిమితి ఉండవనే పాట బాలీవుడ్ తారలకు బాగా సూటవుతుంది. ఇటీవల సినీ పరిశ్రమలో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎఫైర్ చర్చల్లో నడిచింది. ఇంతకంటే ఎక్కువ వారి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరి వయసులో దాదాపు 11 ఏళ్ల తేడా ఉంది. ఈ కారణంగా వారు తరచుగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గురవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో మలైకా అరోరా ఏమన్నారంటే “మనం ఉంటున్న సమాజం భిన్నమైనది. ఒక మహిళ తన కంటే తక్కువ వయసున్న వ్యక్తి ప్రేమిస్తే జనం జీర్ణించుకోలేరు”.
సమాజంలో ఒక భావన ఉంది. పెళ్లి సమయానికి అమ్మాయి వయసు అబ్బాయి కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే భర్త ఇంటి అధిపతి అనుకుంటారు. కనుక అతనికి అనుభవం, అవగాహన ఎక్కువ ఉండాలి. భారత్‌లో ప్రభుత్వం కూడా పెళ్లికి చట్టరీత్యా వయస్సు అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు నిర్ణయించింది.
కానీ మారుతున్న కాలంలో ప్రేమించేతీరులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యమైన విషయమేమిటంటే అబ్బాయిలు తమ కంటే వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిలవైపు ఆకర్షితులవటం. ఇప్పుడు వయసు తేడాను వదిలేసి ప్రేమను, గౌరవాన్ని చూసుకుంటున్నారు.అబ్బాయిలు తమకంటే చిన్న వారిని కాకుండా ఎక్కువ వయసున్న అమ్మాయిలను బాగా ఇష్టపడు తున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇలాంటి ఏజ్ గ్యాప్ కపుల్స్ చాలామంది ఉన్నారు.
ఇమాన్యుయేల్ మెక్రో : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రోన్ వయసు అతని భార్య బ్రిజిట్ మెక్రోన్ కంటే 24 ఏళ్లు తక్కువ. ఇమాన్యు యేల్ మెక్రోన్ స్కూల్లో చదువుతున్న ప్పుడు బ్రిజిట్ అతనికి ఉపాధ్యాయురాలు. అప్పట్లోనే ఇద్దరి మధ్య ప్రేమ ఉండేది.
ఊర్మిళా మతోంద్కర్: నటి ఊర్మిళా మతోంద్కర్ తనకంటే వయసులో 9 ఏళ్లు చిన్న వాడైన మీర్ మోహసిన్ అక్తర్‌ని పెళ్లాడారు. మెహ సిన్ కశ్మీరీ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు