ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల స్క్రీన్ సమయం ఎంతన్నది నిర్ణయించింది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల కళ్లు మాత్రమే పాడవుతాయని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ డబ్ల్యూహెచ్ నివేదిక ప్రకారం, దాని వల్ల జరిగే నష్టాలు మరింత ప్రమాదకరమైనవని తేలింది.
5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సూచించిన స్క్రీన్ సమయం కంటే ఎక్కువగా ఉంటే వారి శారీరక, మానసిక వికాసంపై నష్టం కలుగుతుంది. ఆ రిపోర్టు ప్రకారం తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు వీలైనంత దూరంగా ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు
ఒక సంవత్సరం లోపు పిల్లలకు జీరో స్క్రీన్ టైమ్ నిర్దేశించారు. అంటే వారికి అవి అందుబాటులో ఉండకుండా చూడాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్క్రీన్ సమయం రోజుకు 1 గంటకు మించకూడదు.దీంతోపాటు 3 గంటల పాటు వాళ్లు శారీరక శ్రమ చేయాలని సూచించారు.
ఈ వయసులో పిల్లలకు కథలు చెప్పడం వారి మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. 3 నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఒక రోజులో గరిష్ట సమయం ఒక గంటగా నిర్ణయించారు.
తమ పిల్లలను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. అయినప్పటికీ ఈ విషయాన్ని, సమస్య తీవ్రతను తల్లిదండ్రు లందరూ అర్థం చేసుకోవటం లేదు. పీయూ రీసెర్చ్ సెంటర్ 2020 నివేదిక ప్రకారం 45 % మంది తల్లిదండ్రులు 12 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. అయితే | 28% మంది తల్లిదండ్రులు పిల్లలు 15 ఏళ్లు నిండిన తర్వాతే ఫోన్ వాడవచ్చని చెప్పారు. 22% మంది తల్లిదండ్రులు 11 ఏళ్లలోపు పిల్లలు ఫోన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి. వాళ్లు వాడే ఫోన్లోని యాప్లను పర్యవేక్షించాలి. వినియోగ సమయాన్ని పరిమితం చేయాలి. పిల్లలు వాడే ఫోన్ నుంచి చెడు వెబ్సైట్లు శోధించే వెసులుబాటును బ్లాక్ చేయాలి. ఇంటర్నెట్ సోషల్ మీడియా వల్ల కలిగే హాని గురించి, ప్రమాదాల గురించి వారికి చెప్పాలి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.