Heartfulness Magazine Telugu - December 2022
この問題で
ప్రియమైన పాఠకులకు,
ఆరోగ్యం, సంక్షేమం కోసం సమగ్రమైన విధానం అనే అంశం మీద మొదటి అంతర్జాతీయ సమావేశం నిర్వహణకు కన్హా శాంతి వనం డిశెంబరు 16నుండి 18 వరకు వేదిక కానున్నది. శిఖరాగ్రంలో పురోగామిగా ప్రకాశిస్తున్న ఈ సందర్భానికి దర్పణం పట్టే విధంగా ఈ సంచిక పూర్తిగా సంక్షేమ రంగంలోని విభిన్న నవీనత ఉట్టిపడే పరిశోధనలకు సంబంధించిన విషయాలతో నిండి ఉందని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. అన్యమనస్కత లేదా వికర్షణ, నిర్ణయం చేసుకుని నిర్ధారించే సామర్థ్యం, మన సంరక్షణకు బాధ్యత వహించడం గురించీ నేర్చుకుంటాం. సరైన ఆలోచన, సరైన అవగాహన, చైతన్యం గురించి పరిశీలించడమే కాక, వీటిని ఏ విధంగా మనకై మనం నిజ జీవితంలో అనుదినం పరిశోధిస్తున్నామో తెలుసుకుంటాం. యువ పరిశోధనకర్తలు, సహానుభూతి పరులైన నాయకులకు వేడుక జరిపి వారి నుండి ఆకర్షణలను నిరోధించగల రహస్యాలను తెలుసు కుందాం. చాప కింద నీరులా నిశ్శబ్దంగా పాకుతున్న ‘ఒంటరితనం’అనే మహమ్మారి గురించి మరియు ఆనందం కోసం అన్వేషణ గురించి పరిశోధిద్దాం. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన మూడవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని 2030 సంవత్సరాంతానికి ఎంతవరకూ సాధించగలమో పరిశీలిద్దాం. ఏవిధంగా మన పేగులలోని సూక్ష్మజీవుల జీవావరణం మన వ్యాధినిరోధక రక్షణ కవచాన్ని ప్రభావితం చేస్తుందో కనుగొందాం. అలాగే, ప్రకృతిలోని సహజమైన శబ్దాలు మనకు ఎంతగా సాంత్వన చేకూరుస్తాయో కూడా పరిశీలిద్దాం. ఇంకా, రెజావిక్ నగర పర్యావరణహిత ప్రణాళిక ఏవిధంగా సుస్థిర అభివృద్ధికి అవసరమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరమైన మూడు స్తంభాలను బలంగా తీర్చిదిద్దడంలో ముందుండి ఆ నగరాన్ని పర్యావరణ హితంగా మార్చిందో తెలుసుకుంటాం. చదవండి, ఆనందించండి! ఉత్సాహంగా పండుగ వేడుకలు చేసుకోబోతున్న మీఅందరికీ సంపాదకుల అభినందనలు! మరిన్నివిషయాలు, విశేషాలతో 2023 వసంతంలో మనం కలుసుకుందాం!
Heartfulness Magazine Telugu Description:
出版社: Sahaj Marg Spirituality Foundation
カテゴリー: Religious & Spiritual
言語: Telugu
発行頻度: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ