అరకు కాఫీ కథ :
నాగరికత ప్రస్థానంలో మద్యేతర పానీయాల్లో (Non Alcoholic Beverages) కేవలం మూడింటికిమాత్రమే అన్ని దేశాల్లో మాత్రమే ఆదరణ లభించడం జరుగుతోంది. ఈ మూడింటిలో మొదటిస్థానంలో 'టీ' నిలబడితే రెండోస్థానంలో కాఫీ, మూడోస్థానంలో 'కోకో' వుంటాయి. అయితే అంతర్జాతీ యంగా జరిగే వ్యాపారపరంగా చూస్తే 'కాఫీ', పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎగుమతి దిగుమతి చేసుకునే అతి పెద్ద ఉత్పాదన, కాఫీకి వున్న వ్యామోహం ఆదరణ చూస్తే అది ఒక కొత్తరకపు జీవనశైలికి చిహ్నంగా మారింది. కాఫీ అనేది మనిషికి అవసరమైన పానీయం ఒక స్థాయినించి ఎదిగి శక్తినీ, ఉత్పాదక తనూపెంచే ఔషధంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాఫీ పుట్టుక :
కాఫీ ప్రపధమంగా ఆఫ్రికా ఖండంలో పుట్టి యితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పుడు సుమారు 70 దేశాలలో కాఫీ పండుతోంది. ఇథియోపి యాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు పూర్వీకులు మొదటి సారిగా కాఫీని గుర్తించడం జరిగింది. 'కల్టి' అనే ఇథియోపియాకు చెందిన పశువల కాపరి 'కాఫీ' మొక్కను గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. ఇదియో పియా నుంచి క్రమంగా ఇది అరేబియాకి వ్యాప్తి చెందింది.
భారతదేశలో కాఫీ :
16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా దేశస్తుల కళ్లుగప్పి భారదేశం తీసుకువచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిగమంగళూర్లో తన ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగింజలు ఇప్పుడు పండించబడుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కాఫీ:
1898లో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి 'బ్రాడీ' చేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి తూర్పు గోదావరిజిల్లా పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 ప్రాంతాలకి కాఫీ అరకు లోయలోని అనంత గిరి, చింతపల్లి ప్రాంతాలకి విస్తరించినా అది విస్తృత వ్యాప్తికి నోచుకోలేదు.
'అరకు కాఫీ' పుట్టుక :-
ఆంధ్రప్రదేశ్ ఆటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పచెప్పారు.
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు