వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ సుందరమైన ఒక ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతమైన కార్డూంగ్ పాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమైనట్టుగా జీవితం సాగిపోతుంది. స్వచ్ఛంగా తెల్లగా మెరిసిపోతున్న మంచుకొండలు, గడ్డకట్టే చలిగాలులు, ఆకాశంలో నక్షత్రాలు, కిలోమీటర్లకొద్దీ కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కరిగిపోతున్న మంచు తాలూకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకుపోతున్న సయోక్ నది, ఎడమ వైపు ఎంతో ఇరుకైన రహదారి పర్యాటకులను ఆనందంలో ముంచెత్తుతాయి.
లడక్లోని లేహ్ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే అందమైన ప్రదేశం. దీని పురాతన చరిత్రను పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవనీ, దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని తెలుస్తోంది. ఇండియాలోని చివరి గ్రామమైన తుర్రుక్ అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్గా ప్రాముఖ్యం వహించిన ప్రాంతం ఇప్పటికీ దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.
పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడుతున్న వంద ప్రాంతాల్లో లేహ్ ఒకటి. లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్ర మట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్ర మట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
この記事は Vaartha-Sunday Magazine の October 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の October 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.