పక్కింటి, బంధువుల పిల్లలు చదివేస్తున్నారని పిల్లల్ని నిందించడం ముందుగా మానుకోవాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు, ఘర్షణకు చిన్న సమస్యలే కారణమవుతాయి.ఎదుటివ్యక్తి ఏం చేసిన తప్పుగా కనిపించడం, పాత మనస్పర్థలకు అవి జతకలవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి. వారు చేసిన మంచి, చూపించిన ఆప్యాయత, ప్రేమలు గుర్తుకురావు.అందుకే ఇద్దరి మధ్యా ఎటువంటి పొరపొచ్చాలూ రాకుండా ఉండాలంటే మిగిలిన విషయాల్లో కూడా సమతుల్యత పాటించాలి. పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామనేది తల్లిదండ్రుల ఫిర్యాదు. నిజమే వాళ్ల సందేహాలు, సమస్యలూ, అవసరాలూ, అల్లర్లూ, ముద్దుముచ్చట్లు ఒకటా రెండా, తీర్చేకొద్దీ ఇంకా పుట్టుకొస్తుంటాయి. ఆట వస్తువులతో ఆడుకునే వయసు దాటిన తర్వాత పిల్లలకు తమ చుట్టు వున్న ఇతర వస్తువుల మీదకి దృష్టిపోతుంటుంది. పెద్దవాళ్లు వద్దన్నకొద్దీ ఆ వస్తువులను ఆపరేట్ చేయాలన్న ఆసక్తి పెరుగుతుంటుంది.ఇంట్లో వుంటే టీవీ, డివిడి ప్లేయర్లు, వాలా క్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా ఇతర ఖరీదైన వాటిమీదకి పిల్లల దృష్టి మరలుతుంటుంది. పెద్దవాళ్లకి తెలియకుండా ఆ వస్తువుల్ని ఇంకా ఇతర ఖరీదైన వాటిమీదకి పిల్లల దృష్టి మరలుతుంటుంది. పెద్దవాళ్లకి తెలియకుండా ఆ వస్తువుల్ని కదలించి అటూఇటూ తిప్పి ఆపరేట్ చేసి ఆనందించాలను కుంటారు. ఈ పరిస్థితుల్లో పిల్లలమీద కోప్పడి ప్రయోజనం లేదు. అలా చేస్తే పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఆ పనే చేస్తారు. కాబట్టి వారి ఆసక్తిని గమనించి పనికిరాని,పాడైపోయి, పక్కన పడేసిన కొన్ని వస్తువుల్ని వారి ముందు ఉంచి, భాగాలను సరిగా అమర్చే పనిని పిల్లలకు అప్పగించండి. టీవీ ఆన్ ఆఫ్ చేయడం, వాల్క్ బ్యాటరీలు మార్చడం లాంటి పనులు కూడా వారికే అప్పగించండి. ఆసక్తి వుంది కదా అని గ్యాస్, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషీన్లాంటివి ఆపరేట్ చేయనివ్వకండి. అలా చేయడం వల్ల పిల్లలకు ప్రమాదాలు జరగొచ్చు. పిల్లల్ని స్కూల్లో చేర్పించి, బుక్స్ కొనిచ్చి, ఫీజలు కట్టేయడంతో పేరెంట్స్ పని అయిపోయినట్లు కాదు. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా తెలుసుకుంటూ వుండాలి. రోజూ ఓ గంటసేపైనా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించడం అవసరం. చిన్నారుల చదువును తల్లి, తండ్రి, ఇంట్లో పెద్దలు ఎప్పుడూ పర్యవేక్షిస్తుండాలి.
この記事は Vaartha-Sunday Magazine の February 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の February 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు