పూలజడపై మనసు పడని మగువ ఉండేనా పరిమళ గుబాళింపులకి పరవశించని మగడు ఉండేనా. రంగురంగుల పూల సొగసులూ, విరిసే తావులూ అవనిపైనా అవే కదా పుత్తడి బొమ్మ పెళ్లికూతురు సిగలో నగలైనా అభరణాలైనా!!
ఒకప్పుడు పూలజడ అంటే ఇంటి పెరట్లో తోటల్లోనే లభించే మల్లెపూలు, గులాబిపూలను తీసుకుని, వాటిని అల్లి జడకు అలంకరించేవారు.ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు రెడీమెడ్. మార్కెట్లో మనకు కావలసిన రంగు, డిజన్లలో పూలజడలను తయారుచేసి విక్రయిస్తున్నారు. కొంతమంది తమకు నచ్చిన డిజైన్లను చెప్పి మరీ చేయించు కుంటున్నారు. పెళ్లిళ్ల సీజనల్లో జడలకు మంచి మార్కెట్ ఉంటోంది. మంచి ముహూర్తాల నేపధ్యంలో అన్ని వర్గాలకు ఉపాధి లభిస్తోంది. పెళ్లి జరిగితే వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లిళ్ల సీజన్లో వేలాదిమంది రెండు చేతులా సంపాదించుకుంటారు. సీజన్ లేని సమయంలో కాస్త రిలాక్స్ అవుతారు.సీజన్ ప్రారంభమైతే మాత్రం రాత్రిపగలు అనే తేడా లేకుండా బిజీగా ఉంటారు. పూలజడ అల్లేసే వాళ్లకి ఇప్పుడు చాలా డిమాండ్.పెళ్లికూతురు ముస్తాబు అనగానే ముందుగా గుర్తొచ్చేది పూలజడే.ఆధునికత ఎంత వచ్చి చేరినా వేడుకల్లోనూ, అలంకరణలోనూ పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరనిది. ఇప్పుడు పూలజడల్లో ఆధునికత ఉట్టిపడుతోంది. పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోతున్నాయి. జీవితంలో ఆధునికత ఎంతగా వచ్చి చేరినా వేడుకలలో అమ్మాయిల రూపాన్ని ఒద్దికగా, కనులకు పండుగలా మార్చేసే సుగుణం మాత్రం సంప్రదాయ అలంకరణకే ఉంది. ఆడపిల్ల జీవితంలో వచ్చే ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూలజడలే ప్రధాన ఆకర్షణ. పెళ్లి అలంకారంలో శిరోజాలంకరణకే అమ్మాయిలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నట్టింట్లో ఆడపిల్ల పట్టుపరికిణి, జడకుప్పెలు, కాలిపట్టీలతో ఘల్లుఘల్లు న తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు పడే ముచ్చట చూసితీరాల్సిందే. ఆ అలంకరణలో పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. కొన్ని పూలు అందాలను వెదజల్లితే మరికొన్ని పూలు పరిమళాలను వెదజల్లుతాయి. కొన్ని పూలు ఒక ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఇలా పూలన్నీ ఒక్కో సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళల మనసులు దోచుకుంటాయి.ఏ శుభకార్యమైనా పండగైనా, ప్రయాణమైనా మహిళలు ముందుగా ఆలోచించేది.
この記事は Vaartha-Sunday Magazine の April 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の April 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.